|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణబాలి వెడ్డింగ్ పోస్టర్: ఇది పోస్టర్ కాదు.. అపురూప జ్ఞాపకం! డైరెక్టర్ రాహుల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Published: 01-03-2026, 11:35 AM
రణబాలి వెడ్డింగ్ పోస్టర్: ఇది పోస్టర్ కాదు.. అపురూప జ్ఞాపకం! డైరెక్టర్ రాహుల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ‘రణబాలి’ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
  • విజయ్, రష్మికల పెళ్లి ఫోటోను పోస్టర్‌గా విడుదల చేశారు.
  • పాతకాలపు వెడ్డింగ్ పోస్టర్‌ను రాహుల్ సాంకృత్యన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
  • పాత ఫోటోలంటే ఇష్టమని, వాటిలో నిజాయితీ ఉంటుందని రాహుల్ అన్నారు.

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ రణబాలి సినిమాలోని వెడ్డింగ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ ఒక అపురూపమైన క్షణమని, పాత ఫోటోల మాదిరిగా నిజాయితీగా ఉందని ఆయన అన్నారు. విజయ్, రష్మికల లుక్ ఆకట్టుకుంటుంది.

రణబాలి సినిమా షూటింగ్ విశేషాలు

Rahul sankrityan: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ప్రస్తుతం నటుడు విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి (Ranabaali)అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి కావడంతో వీరిద్దరూ ఈ సినిమాకి చిన్న విరామం ఇచ్చారు. రష్మిక విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మిక మందన్న విజయ్ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రణబాలి సినిమా నుంచి ఒక ఓల్డ్ గెటప్ వెడ్డింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికూతురు పెళ్లి కొడుకు గెటప్ లో వింటేజ్ లుక్ లో ఎంతో చూడచక్కగా ఉన్నారు. పాతకాలపు ఫోటోలలో ఉండే సహజత్వం ఈ ఫోటోలో ఉట్టిపడుతోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul sankrityan) ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ పోస్టర్ వెనుక స్టోరీని ఆయన తెలియజేస్తూ.. మేము నిన్న రణబాలి నుంచి వివాహ పోస్టర్ ను విడుదల చేశాము అయితే ఇది పోస్టర్ గా రూపొందించబడలేదని ఇదొక అపురూపమైన క్షణం అని తెలిపారు.

తనకు పాత ఫోటోలు అంటే ఎంతో ఇష్టమని మా తల్లిదండ్రులు తాతమామలు కెమెరా ముందు నిలబడిన విధానం ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు చిరునవ్వులు చిందించలేదు ఆ ఫోటో ఎలా ఉంటుందో అని ఆందోళన కూడా లేదు. ఆ ఫోటోలు చాలా నిజాయితీగా అనిపిస్తాయని తెలిపారు. రణబాలి ప్రపంచాన్ని నిర్మిస్తున్నప్పుడు నేను కూడా నటీనటుల నుంచి అదే నిజాయితీ కోరుకున్నానని తెలిపారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఈ వివాహపు దుస్తులలో సెట్ కి వచ్చినప్పుడు ఆ దుస్తులలో వారు ఒక హీరో హీరోయిన్ లాగా కనిపించలేదు పూర్వకాలంలో ప్రయాణించిన వారిలాగా కనిపించారు. కొన్ని బంధాలు శాశ్వతమైన కొన్నిసార్లు ఇది వారి గత జీవితాల నుంచి వారి పెళ్లి ఫోటో అని నేను భావిస్తున్నామంటూ రాహుల్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

STORY BEHIND THE WEDDING POSTER

వెడ్డింగ్ పోస్టర్‌పై రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ పోస్ట్

Yesterday, we released the wedding poster of Ranabaali.

But this wasn’t designed as a “poster.” It was a moment.

I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ

పాత ఫోటోల గురించి రాహుల్ ఏమన్నారంటే?

— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026

ఇలా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన ఈ ఫోటో ప ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల ఆయన ఎంతటి నమ్మకాన్ని నిజాయితీని కలిగి ఉన్నారో స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలిగా రష్మిక జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలిత భారతదేశంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

రాహుల్ సాంకృత్యన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రణబాలి పోస్టర్‌లోని నిజాయితీని ప్రశంసించారు. సినిమాపై అంచనాలు పెంచేలా ఆయన పోస్ట్ ఉంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.