|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్ కలెక్షన్స్: ప్రభాస్ కు ఇది నిజంగా షాకే! ఫ్యాన్స్ డిజప్పాయింట్!

Published: 10-01-2026, 4:15 AM
రాజాసాబ్ కలెక్షన్స్: ప్రభాస్ కు ఇది నిజంగా షాకే! ఫ్యాన్స్ డిజప్పాయింట్!
  • రాజాసాబ్ మొదటి రోజు కలెక్షన్లు: రూ. 112 కోట్లు గ్రాస్!
  • ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే రాజాసాబ్ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
  • కల్కి 2898 ఏడీ మొదటి రోజు: రూ. 191 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.
  • సలార్ మొదటి రోజు: ఏకంగా రూ. 178 కోట్లు కొల్లగొట్టింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ విడుదల అయింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజాసాబ్ మొదటి రోజు కలెక్షన్ల రిపోర్ట్

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. నిజానికి, చాలా కాలం తరువాత ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో కనిపించాడు.

అలాగే డాన్సులు కూడా కుమ్మేశాడు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో రాజాసాబ్(The Rajasaab) అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. దీంతో, ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాతో హ్యాపీ గా లేరు అని తెలుస్తోంది.

ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే తక్కువ వసూళ్లు

దీంతో, ఈ ఎఫెక్ట్ రాజాసాబ్ ఫస్ట్ డే కలక్షన్స్ మీద పడింది. తాజాగా రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే కలక్షన్స్ ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా తెలిపారు. ఈ సినిమాకు మొదటిరోజు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. ప్రభాస్ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. కల్కి 2898 ఏడీ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.191 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.

ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయిన రాజాసాబ్

ఇక సలార్ సినిమా మొదటిరోజు రూ.178 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండింటితో పోల్చితే రాజాసాబ్ చాలా తక్కువ కలెక్ట్ చేసిందనే చెప్పాలి. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో రాజాసాబ్ సినిమాకు ఎలాంటి కలక్షన్స్ వస్తాయి అనేది చూడాలి.

రాజాసాబ్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా రానున్న రోజుల్లో ఏమైనా మెరుగవుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.