|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసి మూవీ: రాజమౌళి, మహేష్ బాబుల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు! ఇంతా?

Published: 05-02-2026, 10:05 PM
వారణాసి మూవీ: రాజమౌళి, మహేష్ బాబుల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు! ఇంతా?
  • రాజమౌళి ‘వారణాసి’ సినిమాకు ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 160 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
  • మహేష్ బాబు ఈ సినిమాలో బిజినెస్ పార్టనర్‌గా ఉంటూ లాభాల్లో వాటా రూపంలో రూ. 200 కోట్లు అందుకుంటారని అంచనా.
  • ‘వారణాసి’ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండనుంది.
  • ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ బాబు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

రాజమౌళి రెమ్యూనరేషన్: ఓవర్సీస్ రైట్స్ ద్వారా భారీ మొత్తం?

Varansi Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచర్ డ్రామా చిత్రం ‘వారణాసి’. టాలీవుడ్‌లోనే కాకుండా గ్లోబల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా బడ్జెట్, క్యాస్టింగ్ గురించి వస్తున్న వార్తలు ఒకెత్తయితే, రాజమౌళి మహేష్ బాబు తీసుకోబోయే రెమ్యునరేషన్ డీల్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సాధారణంగా దర్శకులు సినిమాకు కొంత ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ రాజమౌళి బ్రాండ్ వాల్యూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరడంతో, ఆయన ‘వారణాసి’ సినిమా కోసం మొత్తం ఓవర్సీస్ రైట్స్‌ను తన రెమ్యునరేషన్ కింద తీసుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ. 160 కోట్లకు పైమాటే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ‘RRR’ తో గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, విదేశీ పంపిణీ బాధ్యతలను తన వద్దే ఉంచుకోవడం ద్వారా రాజమౌళి భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.

Read also- Gundeninda GudiGantalu Today episode: నిజం తెలుసుకున్న ప్రభావతి.. రోహిణికి మీనా స్ట్రాంగ్ కౌంటర్.. రోహిణి కొత్త కష్టాలు..

మహేష్ బాబు బిజినెస్ డీల్: లాభాల్లో వాటాగా రూ. 200 కోట్లు?

మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాలో బిజినెస్ పార్టనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారట. సినిమా లాభాల్లో వాటా రూపంలో మహేష్ బాబుకు దాదాపు రూ. 200 కోట్లు వరకు వర్క్ అవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే ఒక హీరో అందుకునే అత్యధిక పారితోషికం ఇదే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వారణాసి సినిమాకు రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ప్రకారం, ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్. ఈ సినిమా కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికా, ఆఫ్రికా మరియు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘వారణాసి’ సినిమా: ఆఫ్రికన్ అడవుల్లో యాక్షన్ అడ్వెంచర్!

Read also- Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మొత్తానికి ‘వారణాసి’ సినిమా రాజమౌళి, మహేష్ బాబు కెరీర్‌లలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. భారీ బడ్జెట్, భారీ రెమ్యూనరేషన్‌తో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.