|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajasekhar: నటుడు రాజశేఖర్ ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

Published: 08-12-2025, 10:08 AM
Rajasekhar: నటుడు రాజశేఖర్ ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు
  • సీనియర్ నటుడు రాజశేఖర్ కు మూవీ షూటింగ్ లో ప్రమాదం.
  • ఎడమ కాలి మడమకు ఫ్యాక్చర్లు, శస్త్రచికిత్స జరిగింది.
  • వైద్యులు కొన్ని నెలల విశ్రాంతిని సూచించారు; ఆరోగ్యం నిలకడగా ఉంది.
  • ‘లబ్బర్ పందు’, ‘బైకర్’ సినిమాల షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

సీనియర్ నటుడు రాజశేఖర్ కు సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా కాలి మడమకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రాజశేఖర్ కు షూటింగ్ లో ప్రమాదం

Rajasekhar Injured During Movie Shooting: సీనియర్ హీరో రాజశేఖర్ కు ప్రమాదం జరిగింది. మూవీ షూటింగ్ లో ఆయనకు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాజశేఖర్ కాలి మడమకు తీవ్రమైన గాయమైంది . ఎడమ కాలుకు పలు చోట్ల ఫ్యాక్చర్స్ అవ్వడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రికి తరలించారు.

దీంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్టు తెలుస్తోంది. గాలి గాయం కారణంగా రాజశేఖర్ కు కొన్ని నెలల విశ్రాంతిని సూచించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఆయన గాయం కారణంగా రాజశేఖర్ నటిస్తున్న సినిమాల షూటింగ్ నిలిచిపోయాయి. కాగా ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ ‘ లబ్బర్ పందు‘లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లోనే ఆయన గాయపడినట్టు సమాచారం . ఈ ప్రమాద విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

గాయాలపై వైద్యులు ఏమన్నారు?

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తు ప్రాజెక్టులు

ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు మడిమలో చీలికలు ఏర్పడినట్టు వైద్యులు గుర్తించారు. ఫ్యాక్చర్స్ తో పాటు పలు చోట్ల గాయలైనట్టు సమాచారం. దీంతో ఆయనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రెండు నుంచి మూడు వారాలు విశ్రాంతి సూచించారట . ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు ఆయన మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అదే బైకర్ . శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇటీవల బైకర్ మూవీ సెట్ లో అడుగుపెట్టిన ఆయనకు ఇప్పుడు ప్రమాదం జరగడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కాగా తిరిగి ఆయన జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కోలుకోవడానికి కొన్ని నెలల విశ్రాంతి అవసరం కావడంతో, ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ వాయిదా పడింది. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.