
📌 Key Points
- వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగా మార్చిన ‘చంటి’ సినిమాను రాజశేఖర్ వదులుకున్నారు.
- డైరెక్టర్ శంకర్ మొదటి సినిమా ఆఫర్‌ను రాజశేఖర్ రిజెక్ట్ చేశారు.
- విజయ్ కాంత్ ‘రమణ’ రీమేక్ ‘ఠాగూర్’ మొదట రాజశేఖర్ దగ్గరకు వచ్చింది.
- రాజశేఖర్ డేట్స్ సమస్యల వల్ల ‘లక్ష్మీనరసింహ’ సినిమా కూడా మిస్ చేసుకున్నారు.
ఒక హీరో వదులుకున్న కథ మరో హీరోకు బ్లాక్ బస్టర్ కావడం సాధారణం. కానీ రాజశేఖర్ ఏకంగా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ వదులుకున్నారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు చిరంజీవి, వెంకటేష్‌ల కెరీర్‌ను మార్చేశాయి.
రాజశేఖర్ రిజెక్ట్ చేసిన ‘చంటి’ సినిమా
Rajashekar: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వదులుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడం సహజమే. కానీ, ఒకే హీరో ఏకంగా నాలుగు ఇండస్ట్రీ హిట్లను చేజేతులా వదులుకోవడం అనేది టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన విషాదం. ఆ హీరో మరెవరో కాదు.. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. ఆయన ‘నో’చెప్పిన కథలు ఇతర హీరోల కెరీర్‌నే మార్చేశాయి. అసలు రాజశేఖర్ ఎందుకు ఆ సినిమాలను రిజెక్ట్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? చూసేద్దాం.
‘చంటి’ – వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోని చేసిన సినిమా తమిళంలో ప్రభు నటించిన ‘చిన్నతంబి’ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రాజశేఖర్‌తో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు భావించారు. అయితే, ఆ సమయంలో రాజశేఖర్ వరుసగా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ‘చంటి’లోని అమాయకపు పాత్ర తన ఇమేజ్‌కు సెట్ అవ్వదని రాజశేఖర్ భావించారు.కట్ చేస్తే.. వెంకటేష్ ఆ సినిమాను ‘చంటి’ పేరుతో చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఆ సినిమాతోనే వెంకీకి లేడీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి, ఆయన రేంజ్ మారిపోయిన సంగతి తెల్సిందే.
శంకర్ లాంటి మాంత్రికుడిని గుర్తుపట్టలేకపోయారా? కొంతకాలం కిందటి వరకు ఇండియన్ సినిమాను శాసించిన డైరెక్టర్ శంకర్. ఆయన తన మొదటి కథను పట్టుకుని రాజశేఖర్ చుట్టూ తిరిగారు. కానీ ఆ కథను రాజశేఖర్ రిజెక్ట్ చేశారు. అదే కథతో అర్జున్ హీరోగా వచ్చిన ‘జెంటిల్‌మేన్’ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అలా ఒక గ్రేట్ డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రెడిట్‌ను చేజేతులా వదులుకున్నారు రాజశేఖర్. ఆరోజు ‘ఓకే’ అని ఉంటే, శంకర్ లాంటి విజనరీ డైరెక్టర్‌తో ఆయన మార్కెట్ సౌత్ ఇండియా మొత్తం విస్తరించేది.
శంకర్‌ను మిస్ చేసుకున్న రాజశేఖర్
‘ఠాగూర్’ – మెగాస్టార్‌కు ఇండస్ట్రీ హిట్ గిఫ్ట్ తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ సినిమా అక్కడ పెద్ద హిట్. ఈ సినిమా రీమేక్ హక్కులు మొదట రాజశేఖర్ దగ్గరికే వెళ్లాయి. అయితే ఆ సమయంలో రాజశేఖర్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమో లేక తెలుగు నెటివిటీకి ఈ కథ సెట్ అవ్వదని భావించారో గానీ ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారు. ఆ తర్వాత ఈ కథ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లడం, వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేయడం చకచకా జరిగిపోయాయి. రాజశేఖర్ గనుక ఈ సినిమా చేసి ఉంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఒక రేంజ్‌లో ఉండేది.
‘లక్ష్మీనరసింహ’ – పోలీస్ రోల్‌లో బాలయ్య బాక్సాఫీస్ వేట తమిళంలో విక్రమ్ నటించిన ‘సామి’ అక్కడ ఒక ట్రెండ్ సెట్టర్. పోలీస్ రోల్స్ అంటే కేరాఫ్ అడ్రస్ అయిన రాజశేఖర్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తారని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, నిర్మాత బెల్లంకొండ సురేష్ భావించారు. కానీ అప్పుడే ‘కాకా కాకా’ లాంటి మరో పోలీస్ సినిమా రావడంతో, రెండు ఒకేలా ఉంటాయని దీన్ని రిజెక్ట్ చేశారట రాజశేఖర్. దాంతో ఈ కథ నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి ‘లక్ష్మీనరసింహ’గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలయ్య కెరీర్‌లో ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఫిలిం ఇదే.
చిరంజీవికి ‘ఠాగూర్’ ఎలా వచ్చిందంటే…
జడ్జిమెంట్ తప్పిందని అంగీకరించిన రాజశేఖర్ ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ‘నేను ఆ సినిమాల విషయంలో తప్పుగా ఆలోచించాను, నా జడ్జిమెంట్ తప్పింది’అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్. ఒక హీరో కెరీర్‌లో ఒక్క ఇండస్ట్రీ హిట్ రావడమే చాలా కష్టం.. అలాంటిది ఏకంగా నాలుగు గోల్డెన్ ఛాన్సులను చేజార్చుకున్నారు రాజశేఖర్. ఒకవేళ గనుక ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే, టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ఆయన స్థానం మరోలా ఉండేదేమో!
రాజశేఖర్ కొన్ని మంచి అవకాశాలను చేజార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ ఒక విధంగా నష్టపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇతర హీరోలకు బాగా కలిసొచ్చాయి. ఇది టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి.


