|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బైకర్ మూవీలో రాజశేఖర్ పాత్రకు భారీ రెమ్యూనరేషన్! షాకింగ్ డీటైల్స్!

Published: 24-03-2026, 8:35 AM
బైకర్ మూవీలో రాజశేఖర్ పాత్రకు భారీ రెమ్యూనరేషన్! షాకింగ్ డీటైల్స్!
  • రాజశేఖర్ బైకర్ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
  • ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర రేసింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది.
  • రాజశేఖర్ ఈ సినిమా కోసం రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
  • హీరోగా అవకాశాలు లేక సెకండ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ తెలిపారు.

సీనియర్ నటుడు రాజశేఖర్ త్వరలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్, శర్వానంద్ తండ్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

బైకర్ సినిమాలో రాజశేఖర్ పాత్ర

Rajashekhar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా యువ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాంగ్రీ మెన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజశేఖర్(Rajashekhar) త్వరలోనే శర్వానంద్ (Sharwanand)హీరోగా నటించిన బైకర్(Biker) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ వీడియోకి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఈ సినిమాలో నటుడు రాజశేఖర్ శర్వానంద్ తండ్రిగా కనిపించబోతున్నారు. చిన్నప్పటినుంచి రేసింగ్ లో తన కొడుకుకు శిక్షణ కల్పిస్తూ రేసింగ్ లో ప్రోత్సహించే తండ్రిగా ఈయన కనిపించబోతున్నారని తాజాగా ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం రాజశేఖర్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్(Remuneration) తీసుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

రాజశేఖర్ అందుకున్న రెమ్యూనరేషన్

సోషల్ మీడియా సమాచారం ప్రకారం బైకర్ సినిమా కోసం రాజశేఖర్ ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఇలా తండ్రి పాత్ర కోసం మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో నటించడం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. హీరోగా తన కెరియర్ ముగిసిపోయిందని, తాను చేస్తే రెండో హీరోగానే సినిమాలు చేయాల్సి వస్తుందని ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

రేసింగ్ నేపథ్యంలో బైకర్..

సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ కామెంట్స్

ప్రస్తుతం తాను సినిమాలలో సెకండ్ రోల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, నాకు ఎక్కువ సినిమా అవకాశాలు కల్పించండి అంటూ ఈ సందర్భంగా రాజశేఖర్ తెలియజేశారు. ఇక బైకర్ సినిమా విషయానికి వస్తే శర్వానంద్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. యు వి క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక శర్వానంద్ కూడా ఈ సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నారనే చెప్పాలి. ఈ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఇలా రేసింగ్ నేపథ్యంలో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా బైకర్ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.