
📌 Key Points
- నయన్ సారిక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అని, రామ్ చరణ్‌తో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
- నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.
- నయన్ సారిక గతంలో ‘గం గం గణేశా’, ‘ఆయ్’ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- మెగా ఫ్యామిలీపై నయన్ సారికకున్న అభిమానాన్ని మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
నటి నయన్ సారిక రామ్ చరణ్‌తో కలిసి నటించాలనే తన చిరకాల కోరికను బయటపెట్టింది. ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని అని కూడా తెలిపింది. నిహారిక నిర్మిస్తున్న ‘రాకాస’ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
పవన్ కళ్యాణ్ అభిమానిగా నయన్ సారిక
Nayan Sarika: రాకాస.. ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా గత వారం రోజులుగా ఈ సినిమా పేరే గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. దీనికి కారణం ఈ చిత్ర నిర్మాత నిహారిక (Niharika) అనే చెప్పాలి. ఎక్కడ చూసినా సరే తన సినిమా ప్రమోషన్స్ ను చేపడుతూ తన సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో ఎన్నో విషయాలు పంచుకుంది నిహారిక. ఇకపోతే ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమా హీరోయిన్ నయన్ సారిక కూడా సందడి చేసిన విషయం తెలిసిందే .అందులో భాగంగానే తన డ్రీమ్ గురించి బయట పెట్టి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేసింది.
ప్రెస్ మీట్ లో భాగంగా నయన్ సారికతో మీడియా మిత్రులు మాట్లాడుతూ..” మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరితో మీరు సినిమా చేయాలనుకుంటున్నారు?” అని ప్రశ్నించగా.. ఆమె మాట తడబడకుండా వెంటనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసింది. తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని అని తెలిపినామే.. రామ్ చరణ్ తో కలిసి నటించడమే తన కల అని , ఆయనను చూసినప్పుడు ఏడ్చేసాను అని కూడా తెలిపింది నయన్ సారిక. మొత్తానికైతే రామ్ చరణ్ తో ఒక చిన్న పాత్రలో నైనా సరే కలిసి కనిపించాలని కోరుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కోరికను దర్శక నిర్మాతలు తీరుస్తారేమో చూడాలి. ఇకపోతే మెగా ఫ్యామిలీ పై ఈమెకు ఉన్న ఇష్టాన్ని చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
రాకాస సినిమా ప్రమోషన్స్‌లో నయన్
రామ్ చరణ్‌తో నటించాలనే కోరిక
2024 లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే ఏడాది విడుదలైన ఆయ్ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని పల్లెటూరి అమ్మాయి ఫంక్ పల్లవి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఈ చిత్రంలోని ఈమె పాత్రకు స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు అభినందించారు. ఇక తర్వాత విష్ణు విన్యాసం సినిమాలో నటించిన ఈమె.. ప్రస్తుతం రాకాస అనే సినిమాలో నటిస్తోంది .ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. సంగీత్ శోభన్ , నయన్ సారిక ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఈ చిత్రంలో ఆశీస్ విద్యార్థి, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 140 నిమిషాల నిడివితో రాబోతున్న ఈ చిత్రం ద్వారా 16 కోట్లు వసూలు సాధించింది.
మొత్తానికి నయన్ సారిక తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమె కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


