|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక పెళ్లిపై రచ్చ! రక్షిత్ శెట్టి ఫ్రెండ్ సంచలన కామెంట్స్! విజయ్ ఫ్యాన్స్ షాక్!

Published: 21-02-2026, 10:05 PM
రష్మిక పెళ్లిపై రచ్చ! రక్షిత్ శెట్టి ఫ్రెండ్ సంచలన కామెంట్స్! విజయ్ ఫ్యాన్స్ షాక్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు సమాచారం!
  • రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
  • రష్మిక పెళ్ళికి తనను పిలవలేదని రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి సంచలన వ్యాఖ్యలు.
  • రక్షిత్ శెట్టి తన కెరీర్‌తో బిజీగా ఉన్నాడని, అతని గురించి బాధపడాల్సిన అవసరం లేదని ప్రమోద్ శెట్టి స్పష్టీకరణ.

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఒక సంచలన విషయం ఇప్పుడు బయటకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్?

Vijay- Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay- Rashmika)తో ఆమె వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరుగనుంది. ఈ పెళ్లి అతి కొద్ది మంది సమక్షంలో ఉదయపూర్ లో జరుగనుంది. ఈ పెళ్ళికి సంబదించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. దీంతో, ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్- రష్మికల పెళ్లి గురించే చర్చ నడుస్తోంది.

ఇక, ఈ నేపధ్యంలోనే రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. రష్మిక గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎగజ్మెంట్ బ్రేక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇద్దరు తమ తమ కెరీర్ లో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ విషయం గురించి ఇద్దరు ఎక్కడ కూడా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. కనీసం వల్ల ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా ఎవరు స్పందించలేదు.

రక్షిత్ శెట్టితో రష్మిక బంధం బ్రేకప్!

అయితే, తాజాగా రష్మిక మందన్న పెళ్లి వేళ రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి ఈ విషయంపై స్పందించాడు. రష్మిక పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. “నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. ఒకవేళ వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అంటూ చెప్పుకొచ్చాడు.

రష్మిక పెళ్లిపై రక్షిత్ స్నేహితుడి షాకింగ్ కామెంట్స్!

అనంతరం రక్షిత్ శెట్టి గురించి అతను మాట్లాడుతూ.. అతని గురించి, అతని కెరీర్ ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఆయనేమి చాక్లెట్లు తింటూ, మూలలో కూర్చుని బాధపడే చిన్న పిల్లాడు కాదు కదా. తన జీవితంపై, కెరీర్‌పై తనకు క్లారిటీ ఉంది. ప్రస్తుతం తను తన సినిమాలతో బిజీగా ఉన్నాడు”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రమోద్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.