
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించారు. కానీ, ఆమె బిజీగా ఉండటంతో రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం వచ్చింది.
Key Points
రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను మొదట సంప్రదించారు.
ప్రియాంక బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించబడింది మరియు అంగీకరించింది.
రకుల్ త్వరలోనే లుక్ టెస్ట్ చేయనుంది.
రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్ర
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ ( Ramayan Movie ) ఒకటి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.
ప్రియాంక అవుట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్‌కు ఓకే చెప్పినట్లు భోగట్టా!
ప్రియాంక చోప్రా వైదొలగడం
రామాయణ్.. ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక
చివరగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నిజానిజాలు తెలియాల్సి ఉంది.


