
📌 Key Points
- రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
- అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లో బిజీ అయింది.
- నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
- సింపుల్ లుక్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్.
టాలీవుడ్‌లో అగ్రతార రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సింపుల్ లుక్‌లో రకుల్ అందం నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
రకుల్ ప్రీత్ కెరీర్ ప్రస్థానం
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
వైట్ డ్రెస్సులో అందాల భామ రకుల్
అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
నెటిజన్ల ప్రశంసలు, వైరల్ పోస్ట్
మరో పక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రకుల్ ప్రీత్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. మరీ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ అండ్ కామ్ లుక్‌లో కనిపించింది. ఇక వీటికి.. ‘ప్రశాంతత, సరళత, నిర్మలం’ అని రాసుకొస్తూ వైట్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ సంతోషంగా ఉంది. ఆమె షేర్ చేసిన సింపుల్, అందమైన ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ ఫోటోలు రకుల్ యొక్క సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి.


