|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

Published: 27-03-2026, 4:35 AM
Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్
  • రామ్ చరణ్ 1985 మార్చి 27న మద్రాసులో జన్మించారు.
  • పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ సినిమాతో రామ్ చరణ్ తెరంగేట్రం చేశారు.
  • సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
  • RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణం గురించి తెలుసుకుందాం.

తొలి రోజుల్లో విమర్శలు

Ram Charan Birthday Special: చిరంజీవి ..ఇండస్ట్రీలో ఇదో మహా వృక్షం.అలాంటి చెట్టు నీడలో అంతే ఎత్తుకు ఎదగడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.కానీ తండ్రికి తగ్గ తనయుడిని అంటూ ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఇక తాజాగా నేడు (మార్చి 27)న 41వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న వేళ ఈ చిరుత ప్రయాణాన్ని మనమూ ఓ సారి క్విక్ గా  చూసేద్దాం.

తొలిరోజుల్లోనే విమర్శల జడివాన

చిరంజీవి సురేఖ కొణిదెల దంపతులకి 1985 మార్చి 27 న మద్రాస్(ఇప్పటి చెన్నై)లో జన్మించిన చరణ్ ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చాడు.కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ (ముంబై)లో యాక్టింగ్ కోర్స్ చేసొచ్చిన చరణ్ కి కెరీర్ తొలిరోజుల్లోనే విమర్శల జడివాన తప్పలేదు.ఇక పూరి డైరెక్షన్ లో చిరుత అంటూ సాలిడ్ గానే ఎంట్రీ ఇచ్చిన తండ్రి చాటు బిడ్డగా క్రెడిట్ చిరు ఖతాలోకే వెళ్ళిన పరిస్థితి.కానీ ఎప్పుడైతే మగధీర అంటూ రెండో సినిమాతోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టాడో అప్పుడే చరణ్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలిసొచ్చింది.ముఖ్యంగా సాలిడ్ సక్సెస్ కొట్టడంతో పాటు తనదైన నటనతో విమర్శకులకు దీటుగా ఆన్సర్ ఇచ్చాడు చరణ్ .

నెవెర్ బి ఫోర్ ఎవర్ ఆఫ్టర్

ఇక ఆ తర్వాత ఆరెంజ్, రచ్చ, నాయక్, ఎవడు అంటూ సినిమాలు తీస్తున్న మాటే గాని ఒక్కటీ చరణ్ స్టామినాని సాలిడ్ గా ఎక్స్ప్లోర్ చేయనివే, కానీ ఆ పనిని నేను చేస్తా నంటూ దూసుకొచ్చాడు సుకుమార్.వీళ్ళ కాంబోలో 2018లో వచ్చిన రంగ స్థలం సినిమా చెర్రీ లోని అసలు నటనని బయటపెట్టింది. ముఖ్యంగా చెవిటి వాడిగా చరణ్ పెర్ఫామెన్స్ నెవెర్ బి ఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒకరకంగా మెగాస్టార్ వారసుడు అన్న ట్యాగ్ నుండి బయటపడేసింది ఈ సినిమానే అని చెప్పకతప్పదు.

మలుపు తిప్పిన ‘రంగస్థలం’

టాలీవుడ్ ని మరో మెట్టు ఎక్కించిన RRR

ఇక జక్కన్న డైరెక్షన్లో తారక్ తో కలిసి చేసిన RRR టాలీవుడ్ ని మరో మెట్టు ఎక్కించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజుగా మన్యం వీరుడి గెటప్ లో చూపిన ఇంటెన్సిటీ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఏకంగా రెండు ఆస్కార్ లు దక్కడం విశేషం.ఇక జపాన్, అమెరికా వీధుల్లో దీని హంగామా అంతా ఇంతా కాదు.

అందరి కళ్ళు రానున్న పెద్ది మీదే

ఇక గతేడాది భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చెంజర్ బొక్క బోర్లా పడటంతో ఇపుడు అందరి కళ్ళు రానున్న పెద్ది మీద ఉన్నాయ్. బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూట్ లో చరణ్ కంటికి గాయం అయినా కూడా సర్జరీ చేయించుకొని మళ్ళీ షూట్ లో పాల్గొన్నాడంటే సినిమా పట్ల చరణ్ కి ఎంత ప్రేమ ఉందొ అర్థమవుతుంది. ఇక సినిమాని వచ్చే నెల ౩౦ అంటున్నారు కాని ప్రోగ్రెస్ చూస్తుంటే పోస్ట్ పోన్ అవుతుందా ఏంటి అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయ్.

టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన RRR

ఇక అవార్డుల విషయానికి వస్తే చిరుత (2007)తో స్పెషల్ జ్యూరీ అవార్డు కొట్టేసిన చరణ్ మగధీర (2009) కి కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకోవడం విశేషం.మరో వైపు చిరుత (2008)మగధీర (2010),రంగస్థలం (2019) ,RRR (2024) సినిమాలకి ఉత్తమ తెలుగు నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు కూడా.

హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్

ఇక వైపు సినిమాలతో యమా బిజీగా ఉన్నప్పటికీ, మరో వైపు ఉపాసనకు తోడుగా నిలిచే భర్తగా, క్లింకార, శివరామ్, అన్వీరా దేవి లకి తండ్రిగా తన బాధ్యతలని పోషిస్తూ పక్కా జెంటిల్ మెన్ అనిపించుకుంటున్నాడు.మాములుగా ఎవరైనా శిఖరం చేరుకోవాలనుకుంటారు.కానీ ఆ శిఖరంపై నిలబడి తనకంటూ ఒక కొత్త చరిత్ర రాయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. సో .. అటు తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ,ఇటు యంగ్ హీరోలకి స్పూర్తి గా నిలుస్తున్న మన గ్లోబల్ స్టార్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ !

మొత్తానికి రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి చిత్రం పైనే ఉంది. రాబోయే చిత్రం ‘పెద్ది’ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.