
📌 Key Points
- చిరంజీవి, బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రం తెరకెక్కనుంది.
- ఏప్రిల్ 20 నుంచి ‘మెగా 158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
- కలకత్తా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.
- ప్రియమణి హీరోయిన్ గా, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. చిత్రం కలకత్తా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉండనుందని సమాచారం.
సెట్స్ పైకి మెగా 158: షూటింగ్ ఎప్పుడు?
Mega 158 Film: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంది. ఇలా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో తదుపరి సినిమాపై అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా 158గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇలా తరచూ వాయిదా పడటంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారని తెలుస్తోంది.
కలకత్తా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథ!
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఇక ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులకు సంబంధించిన ఈ విషయం వైరల్ గా మారడంతో కొంతమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయగా మరికొందరు ఈసారైనా ఈ తేదీ పక్కాగా షూటింగ్ ప్రారంభమవుతుందా? లేదంటే మరింత ఆలస్యం అవుతుందా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
కలకత్తా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్..
ప్రియమణి, మోహన్ లాల్ నటిస్తున్నారా?
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సినిమా కలకత్తా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటి ప్రియమణి హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ లాల్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇక చిరంజీవి కూతురి పాత్రలో యువ హీరోయిన్ అనస్వర రాజన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర బృందం ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలను చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియచేయనున్నారు.
మెగా 158 సినిమా షూటింగ్ ప్రారంభం గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


