|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రభాస్ నో చెప్పిన మూవీతో రామ్ చరణ్ సెన్సేషనల్ హిట్! రికార్డులు బద్దలు!

Published: 20-01-2026, 10:05 PM
షాకింగ్: ప్రభాస్ నో చెప్పిన మూవీతో రామ్ చరణ్ సెన్సేషనల్ హిట్! రికార్డులు బద్దలు!
  • ప్రభాస్‌ వదులుకున్న ‘తనిఒరువన్’ బ్లాక్‌బస్టర్‌తో రామ్ చరణ్‌కు సెకండ్ లైఫ్!
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చెర్రీ రీమేక్.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం!
  • తమిళంలో రవి మోహన్ హీరోగా నటించిన ఈ మూవీ 150 కోట్లు వసూలు చేసింది.
  • రామ్ చరణ్‌కు ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ తర్వాత ఇది బిగ్గెస్ట్ హిట్.

టాలీవుడ్ నుండి ఒక సంచలన వార్త! ప్రభాస్ వదులుకున్న ఒక బ్లాక్‌బస్టర్ సినిమా రామ్ చరణ్ కెరీర్‌ను ఎలా మార్చిందో తెలుసా? ఈ సినిమా స్టోరీ వింటే షాక్ అవుతారు.

ప్రభాస్ ఛాన్స్ మిస్.. చెర్రీకి బంపర్ ఆఫర్!

ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ స్టార్‌. ఆయన నటించిన డిజాస్టర్‌ మూవీస్‌ కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని  భారీగా డిజాస్టర్‌ కావడంతో నిర్మాతలు మాత్రం కుదేలవుతున్నారు. ప్రభాస్‌తో సినిమా భారీ వసూళ్లు మాత్రమే కాదు, భారీ నష్టాలను కూడా తెస్తాయి. అదే ఇప్పుడు పెద్ద సమస్య. అయితే ప్రభాస్‌ వదులుకున్న మూవీతో రామ్‌ చరణ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆయనకు  ఓరకంగా సెకండ్‌ లైఫ్‌ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ మూవీ ఏంటి? ఆ కథేంటో తెలుసుకుందాం.

ప్రభాస్‌ రేంజ్‌ `బాహుబలి`తో మారిపోయింది. ఆయన బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. అదే రేంజ్‌లో ఇప్పుడు ఆయన సినిమాలుంటున్నాయి. అయితే డార్లింగ్‌ తన కెరీర్‌ చాలా హిట్‌ సినిమాలు, బ్లాక్‌ బస్టర్స్ వదులుకున్నారు. అలా వదులుకున్న చిత్రాల్లో `తనిఒరువన్‌` కూడా ఉంది. ఇది తమిళంలో రూపొందిన చిత్రం. దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాని రూపొందించారు. తన తమ్ముడు రవి మోహన్‌, నయనతార కాంబోలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో అరవింద స్వామి విలన్‌ రోల్‌ చేశారు. ఇది స్టయిలీష్‌ యాక్షన్‌ మూవీగా చెప్పొచ్చు. మైండ్‌ గేమ్‌తో నడుస్తుంది. ఇది 2015లో విడుదలై  కోలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.150కోట్లు వసూలు చేసిందని అంచనా. అప్పట్లో ఈ కలెక్షన్లు అంటే ఇండస్ట్రీ హిట్‌గా చెప్పుకోవచ్చు.

బ్లాక్‌బస్టర్‌తో రామ్ చరణ్‌కు ఊహించని ట్విస్ట్!

అయితే ఈ సినిమా కథని మొదట దర్శకుడు మోహన్‌ రాజా.. హీరో ప్రభాస్‌ కోసమే రాసుకున్నారట. ఆయనతో చేయాలనుకున్నారు. చాలా ప్రయత్నించారు. కానీ అప్పుడు ప్రభాస్‌.. రాజమౌళి కి కమిట్‌ అయ్యారు. ఆయన `బాహుబలి` సినిమాలను తీస్తున్నారు. వాటికే దాదాపు ఐదేళ్లు కేటాయించారు ప్రభాస్‌. దీంతో `తనిఒరువన్‌` చేయలేకపోయారు.  అలా ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాని రవి మోహన్‌ చేసి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకొని బౌన్స్ బ్యాక్‌ అయ్యారు.

అయితే తమిళంలో ఇది హిట్‌ కావడంతో ఈ మూవీని తెలుగులో చరణ్‌తో రీమేక్‌ చేయాలనుకున్నారు చిరంజీవి. ఎందుకంటే రామ్‌ చరణ్‌ అప్పటి వరుస ఫ్లాప్‌ల్లో ఉన్నారు. `గోవిందుడు అందరివాడేలే`, `బ్రూస్లీ` చిత్రాలు ఆడలేదు. రెండూ దారుణంగా పరాజయం చెందాయి. ఓ రకంగా చరణ్‌ కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. దీంతో `తనిఒరువన్‌`ని రీమేక్‌ చేయాలనుకున్నారు. అల్లు అరవింద్‌, సురేందర్‌ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. చరణ్‌తో సినిమా చేశారు. ఇందులో రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. నెగటివ్‌ రోల్‌లో అరవింద స్వామినే నటించారు. తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రామ్‌ చరణ్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుంది. అలా ప్రభాస్‌ వదులుకున్న మూవీతో చరణ్‌ బ్లాక్‌ బస్టర్ అందుకున్నారని చెప్పొచ్చు.

చిరంజీవి ప్లాన్.. చెర్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్!

ఆ తర్వాత సుకుమార్‌తో `రంగస్థలం` మూవీ చేశారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. నాన్‌ బాహుబలి రికార్డులను లేపేసింది. అనంతరం `వినయ విధేయ రామ`తో డిజాస్టర్ పడింది. కానీ రాజమౌళి తో చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆయన్ని పాన్‌ ఇండియా స్టార్‌ ని చేసింది. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇది మార్చి 27న విడుదల కాబోతుంది.

ఈ సినిమా రామ్ చరణ్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.