|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జ్వరంతో ఊగిపోతున్నా ఆగని చరణ్ జోష్! ‘రై రై రా రా’ సాంగ్ సీక్రెట్స్!

Published: 03-03-2026, 7:35 AM
జ్వరంతో ఊగిపోతున్నా ఆగని చరణ్ జోష్! ‘రై రై రా రా’ సాంగ్ సీక్రెట్స్!
  • ‘పెద్ది’ మూవీలోని ‘రై రై రా రా’ పాటకు చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
  • పాట షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు తీవ్ర జ్వరం ఉన్నా డ్యాన్స్ చేశారని బుచ్చిబాబు అన్నారు.
  • రామ్ చరణ్ డ్యాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం అద్భుతంగా ఉన్నాయని సెలబ్రిటీల ప్రశంసలు.
  • చిరంజీవి తనయుడు రామ్ చరణ్ డెడికేషన్‌ను చూసి గర్వపడుతున్నానని తెలిపారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీలోని ‘రై రై రా రా’ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాట షూటింగ్ సమయంలో చరణ్‌కు జ్వరం ఉన్నప్పటికీ ఆయన ఎంతో డెడికేషన్‌తో చేశారని బుచ్చిబాబు తెలిపారు.

‘రై రై రా రా’ పాటపై చిరంజీవి ప్రశంసలు

Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). తాజాగా ఈ మూవీ నుంచి ‘రై రై రా రా’ (Rai Rai Raa Raa) అనే సాంగ్ విడుదలై, సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ స్టెప్స్‌కు, ఏఆర్ రెహమాన్ వాయిస్ అండ్ మ్యూజిక్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ చూసి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చేశారంటే, ఏ రేంజ్‌లో సాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్‌పై ప్రశంసలు కురిపించడంతో.. దర్శకుడు బుచ్చిబాబు సానాకు అస్సలు మాటలు లేవంటే నమ్మాలి. వెంటనే ఆయన థ్యాంక్స్ సార్ అని చెబుతూ.. ఈ సాంగ్ చేసే సమయంలో చరణ్ పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ముందుగా చిరంజీవి ఏమన్నారంటే..

‘‘స్క్రీన్‌పై రై రై రా రా సాంగ్ ఒక షీర్ ఫైర్. ఎనర్జీ, ఎమోషన్ సినిమాటిక్ బ్రిలియన్స్ కలగలిసిన అద్భుతం ఇది. చరణ్ తన ఎఫర్ట్‌లెస్ గ్రేస్‌తో, మెరుపు వేగంతో స్క్రీన్‌ని వెలిగించేస్తుంటే ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది. తను కదిలే తీరు చూడముచ్చటగా ఉంది’’ అంటూ దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డ్యాన్స్ మాస్టర్ జానీ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, లిరిక్స్ రైటర్ అనంత శ్రీరామ్, నిర్మాత సతీష్ కిలారుకు, ఇంకా టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌కు ‘రై రై రా రా’ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ వీడియోని కూడా జత చేశారు. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు, ఈ సాంగ్ చూసిన తర్వాత సెలబ్రిటీలెందరో రియాక్ట్ అవుతూ.. టీమ్‌ని కొనియాడుతున్నారు. రామ్ చరణ్ డ్యాన్స్, ఏఆర్ రెహమాన్ వాయిస్ అండ్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ సాహిత్యం అద్భుతం అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

జ్వరంతో రామ్ చరణ్ డ్యాన్స్: బుచ్చిబాబు

ఇక చిరంజీవి ట్వీట్‌కు దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ సో మచ్ సార్. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ బీజీఎమ్ షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సర్‌కి హై ఫీవర్ సార్. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన ‘లేదు చేద్దాం’ అన్నారు. అంత జ్వరంలో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ యాటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్.. లవ్ యు సార్’’ అని తన సంతోషాన్ని తెలియజేశారు. అలాగే ఇటీవల ‘మోగ్లీ’ సినిమాలో విలన్‌గా నటించిన బండి సరోజ్ కుమార్ కూడా ఈ సాంగ్‌పై ప్రశంసలు కురిపించగా, ‘మీ ప్రేమ, ఆప్యాయతలకు థ్యాంక్యూ సో మచ్ సార్’ అంటూ బుచ్చిబాబు స్పందించారు. బుచ్చి ఇచ్చిన స్పందన ఇప్పుడు వైరల్ అవుతోంది. చరణ్ ఫ్యాన్స్ అయితే ‘తలా.. ఇరగ్గొట్టావ్’ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

Thank you sooo much Sirrrr ❤️❤️❤️🙏🙏🙏

ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్‌కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు.

పాటపై సెలబ్రిటీల ప్రశంసలు

ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw

— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026

మొత్తానికి, రామ్ చరణ్ డెడికేషన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు టేకింగ్ తో ‘రై రై రా రా’ పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.