
📌 Key Points
- రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి.
- చిత్ర బృందం విడుదల చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- వీడియోలో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు మధ్య సరదా సంభాషణలు ఉన్నాయి.
- రామ్ చరణ్ డబ్బింగ్ గురించి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. చిత్ర బృందం ఒక సరదా వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు మధ్య సరదా సంభాషణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
పెద్ది సినిమా డబ్బింగ్ ప్రారంభం
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది కోసం డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు రామ్ చరణ్ కూల్ నేచర్‌ను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో డబ్బింగ్ థియేటర్‌లో దర్శకుడు బుచ్చిబాబు.. పక్కన రామ్ చరణ్ కూర్చుని ఒక కీలకమైన సీన్‌ను చూస్తూ కనిపించారు. ఆ సీన్ స్క్రీన్‌పై నడుస్తున్న సమయంలో బుచ్చిబాబు ఆ సీన్ లో చాలా హై పిచ్ లో..రెడీ..అని గట్టిగా చెప్పారు.
ఆ సీన్ చూసిన వెంటనే రామ్ చరణ్ నవ్వుతూ బుచ్చిబాబును సరదాగా ఆటపట్టించారు. “ఏమిటది..బుచ్చి… నువ్వు ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నావు? నా డబ్బింగ్ కోసం ఇంత టెన్షన్ పడొద్దు. నేను చూసుకుంటాను” అని నవ్వుతూ అన్నారు.
వైరల్ అవుతున్న రామ్ చరణ్ వీడియో
#RamCharan dubbing for #Peddi 🎬#Peddi BTS | #BuchiBabuSana pic.twitter.com/C3ZfJoKfaW
— MovieMind (@_MovieMind) March 1, 2026
చికిరి సాంగ్ కి కూడా ఆ సింగర్ కన్న బుజ్జి నే ఫీలయ్యారు అంటూ మరో జోక్ వేశారు. దీనికి బుచ్చిబాబు కూడా సరదాగా స్పందించారు. తాను ఎందుకు అలా ఫీల్ అయ్యానో చెబుతూ, ‘చికిరి’ పాట లిరిక్స్ పాడారు. అంతేకాదు, సరదాగా ఆ పాటను హమ్ చేస్తూ ఉండగా..దీనిపై రామ్ చరణ్ మరింత హాస్యంగా స్పందించారు. “ఆ పాట పాడిన సింగర్ కన్నా నువ్వే ఎక్కువ ఫీల్ అయ్యావు” అని నవ్వుతూ చెప్పారు. ఈ సరదా సంభాషణతో ఆ వీడియో మొత్తం నవ్వులతో నిండిపోయింది.
దర్శకుడితో రామ్ చరణ్ సరదా సంభాషణ
ఈ సరదా మాటల తర్వాత పెద్ది డబ్బింగ్ పనులు అధికారికంగా మొదలయ్యాయి. డబ్బింగ్ ప్రారంభమైందని రామ్ చరణ్ స్వయంగా అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన అభిమానులు రామ్ చరణ్ పాజిటివ్ ఎనర్జీ, సింపుల్ నేచర్‌ను చూసి మరింత అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రామ్ చరణ్ పెద్ది సినిమా డబ్బింగ్ ప్రారంభం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.


