|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’కి శివన్న అదిరిపోయే గిఫ్ట్! బుచ్చిబాబు షాకింగ్ రియాక్షన్!

Published: 17-02-2026, 9:05 PM
రామ్ చరణ్ 'పెద్ది'కి శివన్న అదిరిపోయే గిఫ్ట్! బుచ్చిబాబు షాకింగ్ రియాక్షన్!
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న విడుదల!
  • శివరాజ్ కుమార్ నుండి బుచ్చిబాబుకి స్పెషల్ గిఫ్ట్ అందజేత!
  • ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో అంచనాలు భారీగా!
  • ‘పెద్ది’ సినిమా నుంచి త్వరలో రెండో పాట విడుదల కానుంది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బుచ్చిబాబుకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

శివన్న స్పెషల్ గిఫ్ట్ తో బుచ్చిబాబు ఎమోషనల్

Buchibabu Sana: ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్ది పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక పాన్ ఇండియా లెవల్లో వస్తున్న పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు శివరాజ్ కుమార్. ఈ విషయాన్ని అయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. అసలు ఈ కథని ఆ బుచ్చిబాబు ఎలా రాశాడో తెలియదు కానీ, చాలా గొప్ప కథ అవుతుంది అంటూ చెప్పాడు.

‘పెద్ది’ మూవీ షూటింగ్ చివరి దశలో!

అందుకే, ఇటీవల బుచ్చిబాబు(Buchibabu Sana) కోసం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు శివరాజ్ కుమార్. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్బంగా శివరాజ్ కుమార్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, ఆ బహుమతి అందుకోవడం తనకు ఎమోషనల్ మూవ్మెంట్ అంటూ రాసుకొచ్చాడు బుచ్చిబాబు. అయితే, ఆ గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు బుచ్చిబాబు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ సినిమాపై అంచనాలు భారీగా!

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. క్రికెట్ కి సంబందించిన ఒక భారీ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక పెద్ది సినిమా నుంచి రెండో పాట త్వరలోనే విడుదల కానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్థుండై అనేది చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.