|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్‌తో స్పెషల్ సాంగ్

Published: 27-08-2025, 12:43 PM
Ram Charan రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్‌తో స్పెషల్ సాంగ్

మెగా హీరో రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా, ఈ సినిమాలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఒక ప్రత్యేక గీతం చిత్రీకరణ జరుగుతోంది. జానీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Key Points

1

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ప్రత్యేక గీతం

2

జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణ

4

మార్చి 27, 2026న 'పెద్ది' థియేటర్లలో విడుదల

వెయ్యి మంది డ్యాన్సర్లతో స్పెషల్ సాంగ్

గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్‌ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్‌ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ

ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్‌ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

మార్చి 27, 2026 విడుదల

కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా  మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

‘పెద్ది’ చిత్రం లోని ఈ వెయ్యి మంది డ్యాన్సర్లతో కూడిన ప్రత్యేక గీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.