
📌 Key Points
- రామ్ చరణ్ ‘మగధీర’ సమయంలో చేతికి తీవ్ర గాయమైంది.
- ఆ పాత గాయంతోనే ‘పెద్ది’ కోసం కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నారు.
- రోజువారీ షూటింగ్ తర్వాత కూతురిని ఎత్తుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు.
- చరణ్ అంకితభావం ‘పెద్ది’పై అంచనాలను భారీగా పెంచుతోంది.
రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ కోసం అసాధారణ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘మగధీర’ సమయంలో తగిలిన పాత చేతి గాయాన్ని సైతం లెక్కచేయకుండా, కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా చరణ్ శ్రమను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.
పాత గాయంతోనే ‘పెద్ది’ కోసం సాహసం
Ram Charan: మెగాస్టార్ వారసుడిగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం Peddi (పెద్ది) కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూ, చరణ్ పడుతున్న కష్టాన్ని చూసి తనకు చాలా ఆందోళన కలిగిందని దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఇటీవల ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.
Read also సామాన్యుడికి దూరమవుతున్న వెండితెర!.. ఐపీఎల్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..
దర్శకుడు బుచ్చిబాబు ఆందోళన
గతంలో ‘మగధీర’ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చేతికి తీవ్రమైన గాయమైంది. ఆ గాయం కారణంగా ఆయన ఇప్పటికీ నిరంతరాయంగా చేతి నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ, ఎక్కడా తగ్గకుండా ‘పెద్ది’ సినిమా కోసం అత్యంత కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు. ‘పెద్ది’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిమాండింగ్‌గా ఉన్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం నిజమైన పెహల్వాన్లను రంగంలోకి దించారు. వారితో చరణ్ అత్యంత ప్రమాదకరమైన కుస్తీ పోటీలు, స్టంట్స్ చేయాల్సి వచ్చింది. షూటింగ్ అంతటా ఈ తరహా హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ కొనసాగింది.
Read also- ఓటీటీని షేక్ చేస్తున్న ‘అవతార్ 2’.. హోమ్ వ్యూయర్స్ అస్సలు వందలడంలేదుగా..
అంకితభావంతో పెరిగిన అంచనాలు
రోజంతా పెహల్వాన్లతో కుస్తీలు పట్టి, భారీ స్టంట్స్ చేసి, షూటింగ్ ముగిసే సమయానికి రామ్ చరణ్ శారీరకంగా పూర్తిగా అలసిపోయేవారు. రోజంతా పడ్డ శ్రమ వల్ల, ప్యాకప్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం తన ముద్దుల కూతురు క్లిన్ కారాను చేతుల్లోకి ఎత్తుకోవడానికి కూడా ఆయనకు ఓపిక ఉండేది కాదు. చరణ్ అంతలా అలసిపోయేవారు. అంటూ బుచ్చి చెప్పుకొచ్చారు. షూటింగ్ స్పాట్‌లో రామ్ చరణ్ పడుతున్న శ్రమను, ఆ సమయంలో ఆయన ఆరోగ్యాన్ని చూసి దర్శకుడు బుచ్చిబాబు సానా నిజంగానే చాలా కంగారుపడ్డారట. చరణ్ హెల్త్ కండిషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని తాను ఎంతో ఆందోళన చెందినట్లు బుచ్చిబాబు తాజాగా రివీల్ చేశారు. నొప్పిని భరిస్తూ, శారీరక శ్రమను సైతం లెక్కచేయకుండా రామ్ చరణ్ చూపిస్తున్న ఈ అంకితభావం ‘పెద్ది’ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
రామ్ చరణ్ పాత గాయాన్ని భరిస్తూ, ‘పెద్ది’ కోసం పడుతున్న శ్రమ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఆయన అంకితభావం, కష్టపడే తత్వం అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.


