|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాము రాథోడ్ ‘డీజే పిల్లా’ సునామీ! 25 రోజుల్లో 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ షేక్!

Published: 26-05-2026, 6:45 AM
రాము రాథోడ్ 'డీజే పిల్లా' సునామీ! 25 రోజుల్లో 25 లక్షల వ్యూస్.. యూట్యూబ్ షేక్!
  • ‘డీజే పిల్లా’ సాంగ్ కేవలం 25 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
  • రాము రాథోడ్, బిగ్ బాస్ కంటెస్టెంట్, ఈ మాస్ మసాలా ఫోక్ సాంగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
  • రోజుకు లక్షకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ పాట యువతను ఆకట్టుకుంటూ డిజేలను హీటెక్కిస్తోంది.
  • ‘రాను బొంబైకి రాను’ తర్వాత రాము రాథోడ్ నుండి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ ఫోక్ సాంగ్ ఇది.

టాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పుడు సినిమా పాటల కంటే జానపద గీతాలే ఉర్రూతలూగిస్తున్నాయి! తాజాగా, యూట్యూబ్‌లో ఓ సరికొత్త సంచలనం మొదలైంది. మాస్ మసాలా స్టైల్‌లో వచ్చిన ‘డీజే పిల్లా’ సాంగ్ రికార్డుల మోత మోగిస్తూ, నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన పాట వివరాలు ఇప్పుడు చూద్దాం!

మాస్ మసాలా మ్యూజిక్ మాయ

Trending Folk Song : ప్రస్తుతం సినిమా పాటలకంటే జానపద పాటలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చిన ఫోక్ సాంగ్స్ అనేకం ఉన్నాయి. తమ జీవితానికి దగ్గరగా ఉండే జానపద పాటలకు తెలుగు ప్రజలు పట్టం కడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా ‘సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ’, ‘రాను బొంబైకి రాను’ వంటి పాటలో ప్రజల్లోకి బలంగా వెళ్లి యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు హిట్ పోక్స్ ఒక్కరు రూపొందించినవే.

తన జానపద పాటలు, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాము రాథోడ్. ఓ సాధారణ బంజారా బిడ్డను బిగ్ బాస్ వంటి ప్రతిష్ఠాత్మక రియాలిటీ షో కు తీసుకెళ్లింది ఈ జానపద పాటలే. ”రాను బొంబైకి రాను” హిట్ సాంగ్ తర్వాత రాము రాథోడ్ నుండి మరో అద్భుతమైన డిజె పిల్ల సాంగ్ వచ్చింది. ఇటీవలే యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది… రోజుకు లక్షకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

కళ్ళాకు రేబాన్ యెట్టూకూనీ…

కాళ్లాకూ రిబ్బాను చుట్టూకూనీ…

బిగ్ బాస్ రాము రాథోడ్ సక్సెస్

వచ్చిందండీ వయ్యారీ.. అబ్బో వచ్చేయరా ఓరీ వారీ…

డుగ్గుడుగ్గు… ఏ డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గు..

డిజె పిల్ల ఓ డిజె పిల్ల.. నేను స్టేప్పులెస్తే డప్పలాయె గుండెలు మళ్లా..నేను డిజె పిల్లా…

ఇలా అదిరిపోయే లిరిక్స్ తో సాగుతుంది డిజె పిల్ల సాంగ్. అసలు జీవితంలో ఒక్కసారి కూడా స్టెప్పులేయని వారితో కూడా డ్యాన్స్ చేయించేలా మాస్ మసాలా మ్యూజిక్ ఉంటుంది. మొత్తంగా జెంజీ యువతను టార్గెట్ గా చేసుకుని రూపొందించిన ఈ ఫోక్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

రికార్డుల వేటలో ‘డీజే పిల్లా’

ఇప్పటికే రాము రాథోడ్ పాటలకు అభిమానులు ఉన్నారు. వారి టేస్ట్ కు తగ్గట్లుగానే ఉంటుంది ఈ డిజె పిల్ల సాంగ్. ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ పాట రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, బరాత్ లతో గట్టిగా వినిపించనుంది. ఈ డిజె పిల్ల సాంగ్ దెబ్బకు డిజేలు హీటెక్కడం, యువత ఉర్రూతలూగడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ రాము రాథోడ్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ విజిల్ స్టూడియోస్ ఆండ్ రాథోడ్ ట్యూన్స్ లో ఈ పాట విడుదలయ్యింది. ఈ నెల ఆరంభంలో (మే 1న) విడుదలచేయగా ఇప్పటివరకు 2.5 మిలియన్స్ అంటే 2516369 వ్యూస్ తో దూసుకుపోతోంది. అంటే రోజుకు లక్షమందికి పైగా ఈ పాటను చూస్తున్నారన్నమాట. విన్నవారిలో 37 వేలమంది లైక్ చేశారు.

దేవ్ పవర్ అందించిన మాస్ లిరిక్స్ కు మదీన్ ఎస్కే మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది… దీంతో ఈ పాట మరోస్థాయికి వెళ్లింది. ఇక రాము రాథోడ్, వాగ్దేవీ వాయిస్ ప్లస్ అయ్యింది. ఢీ ఫేమ్ రామ్ మాస్టర్ కొరియోగ్రఫి… రాము రాథోడ్, ప్రాచీ స్టెప్పులు మరోస్థాయికి చేర్చాయి. అన్నీ సరిపోవడంతోనే డిజె పిల్ల సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

మొత్తానికి, ‘డీజే పిల్లా’ సాంగ్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తూ, జానపద పాటల క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రాము రాథోడ్ తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.