|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్లి తర్వాత రష్మికకు తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 10-04-2026, 4:05 AM
షాకింగ్: పెళ్లి తర్వాత రష్మికకు తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితంగా జరిగింది!
  • కొడగులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన రష్మిక దంపతులు!
  • భార్యకు కడనూరులో ‘Serenity’ బంగళాను బహుమతిగా ఇచ్చిన రష్మిక తండ్రి!
  • రణబలి సినిమాలో భార్యాభర్తలుగా విజయ్, రష్మిక! సెప్టెంబర్ 11న విడుదల!

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి తర్వాత రష్మిక పుట్టింటికి వెళ్లడం, అక్కడ ఆమెకు లభించిన గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే…

విజయ్, రష్మికల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్!

రష్మిక మందన్నా తెలుగింటి కోడలుగా మారింది. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకొని అప్పుడే రెండు నెలలు కావస్తోంది. ఉదయ్ పూర్ లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్యలో ఈ జంట వివాహం చేసుకోగా.. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి.. సినీ, రాజకీయ ప్రముఖులను విందుకు ఆహ్వానించారు.

కాగా, వివాహం జరిగిన రెండు నెలల తర్వాత రష్మిక తన భర్త విజయ్ తో కలిసి తన స్వస్థలమైన కొడగుకు వచ్చారు. తన పుట్టిన రోజు కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. పెళ్లి తర్వాత మొదటిసారి అక్కడికి రావడంతో.. అక్కడి వారి కోసం ఒక ప్రత్యేక విందు( రిసెప్షన్ ) కూడా ఏర్పాటు. ఈ రిసెప్షన్ లో రష్మిక తమ కొడగు సంస్కృతీ, సంప్రదాయల ప్రకారం ముస్తాబయ్యారు. కొడవ శైలి చీరను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా కూడా మారాయి.

కూతురికి తండ్రి ఇచ్చిన అదిరిపోయే గిఫ్ట్!

విజయ్ కూడా.. తెలుగు, నలుపు కాంబినేషన్ లో సూట్ ధరించారు. అంతేకాదు అక్కడి ప్రజలను ఆకట్టుకునేలా కన్నడ భాషలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సంగతి పక్కన పెడితే.. తొలిసారి తమ ఇంటికి వచ్చినందుకు విజయ్- రష్మికలకు వాళ్ల పేరెంట్స్ అరుదైన బహుమతిని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక తండ్రి మదన్ మందన్నా.. తన కుమార్తెకు కడనూరు సమీపంలో అన్ని హంగులతో కూడిన ‘ Serenity’ అనే బంగళాను బహుమతిగా ఇచ్చారు. ఈ బంగళా రిజిస్ట్రేషన్ ప్రక్రియ విరాజ్ పేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పూర్తి అయ్యింది. ఈ బంగళాను అధికారికంగా రష్మిక పేరు మీదకు మార్చడం విశేషం.

రణబలిలో భార్యాభర్తలుగా రష్మిక, విజయ్!

ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా కనిపించబోతున్న తాజా చిత్రం రణబలి. ఈ సినిమాలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రష్మిక, విజయ్ జంట గురించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ మీకోసం అందిస్తూనే ఉంటాం. మరిన్ని సినిమా వార్తల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.