|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna: ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ప్రతీ భావన హృదయాన్ని తాకుతోంది.. మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..

Published: 22-10-2025, 6:50 AM
Rashmika Mandanna: ఈ ప్రయాణాన్ని ఎలా వివరించాలి.. ప్రతీ భావన హృదయాన్ని తాకుతోంది.. మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘థామా’ విజయానికి, ఆ ప్రయాణానికి సంబంధించిన భావోద్వేగ పోస్ట్ చేసింది. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన రష్మిక, తదుపరి చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ గురించి కూడా ప్రస్తావించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Key Points

1

రష్మిక నటించిన 'థామా' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

2

సినిమా టీం, దర్శకుడు ఆదిత్య సర్పోదర్‌పై రష్మిక కృతజ్ఞతలు తెలిపింది.

4

ప్రస్తుతం రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో నటిస్తోంది.

‘థామా’ ప్రయాణంపై రష్మిక భావోద్వేగం

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ థామా. హారర్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ ను తెచుకుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు (Rashmika Mandanna)ఆదిత్య సర్పోదర్‌ తెరకెక్కించాడు. ఇక సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో తన కృతజ్ఞతను సోషల్ మీడియా ద్వార తెలియజేసింది ఈ బ్యూటీ.

Ramya Krishna: సినిమా కాదు.. ఐటెం సాంగ్స్ చేయాలని ఉంది.. జగపతిబాబుకి షాకిచ్చిన రమ్యకృష్ణ

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నేషనల్ క్రష్

ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “థామా.. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఎక్కడినుంచి మొదలుపెట్టాలి.. ఎలా వివరించాలి. మొదటిరోజు నుంచి చివరిరోజు వరకూ ప్రతిదీ మనసుకు హత్తుకునేదే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నవ్వులు, గాయాలు, నిద్ర లేవడానికి ఇష్టపడని ఉదయాలు అన్నీ మనసులో గుర్తుండిపోతాయి. ఇక దర్శకుడు ఆదిత్య సర్పోదర్‌పై గౌరవంతో నా మనసు నిండిపోయింది. ఆయన నాపై నమ్మకం ఉంచారు. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన సిబ్బంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. షూటింగ్‌ను సజావుగా సాగింది అంటే దానికి కారణం వాళ్ళే. షూటింగ్ లో పడిన కష్టమంతా సినిమాకు వచ్చే పాజిటివ్‌ కామెంట్స్‌కు మర్చిపోతాం. ఇక నా ఫ్యాన్స్.. మీ ప్రేమ, మీ సపోర్ట్.. మీ ప్రతి భావన నా హృదయాన్ని తాకుతుంది. నామనసులో నిలిచిపోతుంది. అందరికీ నా కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్మిక తర్వాతి ప్రాజెక్ట్‌లు

ఇక రష్మిక చేసిన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను దర్శకడు రాహుల్ రవీంద్రన్ తెరకేక్కిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంలో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తంగా, ‘థామా’ సినిమాతో రష్మిక మందన్న పొందిన అనుభవాలు, అభిమానుల ప్రేమ ఆమెకు ఎంతో ప్రత్యేకం. ఆమె తదుపరి ప్రాజెక్టులైన ‘ది గర్ల్ ఫ్రెండ్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.