
📌 Key Points
- విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ మూవీ గ్లింప్స్ గ్రాండ్‌గా రిలీజ్.
- 2026లో సినిమా విడుదల అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్.
- రష్మిక మందన్న ‘లెట్స్ గో..’ అంటూ లవ్, ఫైర్ ఎమోజీలతో రిప్లై.
- విజయ్-రష్మిక పెళ్లి పుకార్లపై నెటిజన్ల కామెంట్ల వర్షం.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన’ విడుదల తేదీపై చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌కు రష్మిక మందన్న ఇచ్చిన అనూహ్య రిప్లై నెటిజన్లలో చర్చకు దారితీసింది. వారిద్దరి పెళ్లి పుకార్లతో ఈ వార్త మరింత వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ పోస్ట్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న తాజా మూవీ ‘రౌడీ జనార్ధన’. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ నిన్న(సోమవారం) మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో గ్లింప్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.
తెలంగాణ స్లాంగ్‌లో విజయ్ దేవరకొండ అరాచకం సృష్టించాడు. ఇదిలా ఉంటే.. నిన్న(సోమవారం) విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ 2026లో విడుదల కాబోతుందని మూవీకి సంబంధించిన పోస్ట్ పెట్టారు. అందులో ‘గాయపడిన వ్యక్తి జీవిత చరిత్ర’ అంటూ రాసుకొచ్చారు. విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్‌కు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ.. రిప్లై ఇచ్చారు. ఆ పోస్ట్ ట్యాగ్ చేస్తూ ‘‘లెట్స్ గో.. లెట్స్ గో.. లెట్స్ గో..’’ అని లవ్, ఫైర్ ఎమోజీని అటాచ్ చేసింది. అయితే, రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలిసిందే. ప్రజెంట్ నేషనల్ క్రష్ రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లింక్
రష్మిక ఇచ్చిన షాకింగ్ రిప్లై
నెట్టింట రచ్చ చేస్తున్న నెటిజన్ల కామెంట్లు
మొత్తానికి, విజయ్ దేవరకొండ పోస్ట్, రష్మిక రిప్లై కలగలిసి నెట్టింట భారీ చర్చకు దారి తీశాయి. అభిమానులు, నెటిజన్లు వారి సంబంధంపై మరింత స్పష్టత కోరుకుంటున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.


