
📌 Key Points
- రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ టాక్!
- ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం!
- డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ గ్లామర్‌తో అదరగొట్టేశారు.
- తెలంగాణలో టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ 175, మల్టీప్లెక్స్ 200 రూపాయలు మాత్రమే!
మాస్ మహారాజా రవితేజ మరోసారి తన సత్తా చాటాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
బ్లాక్ బస్టర్ మీట్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి కామెంట్స్!
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.
ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు కళకళ!
బ్లాక్ బస్టర్ మీట్ లో నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ..మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్. మా హీరో రవితేజ గారికి, హీరోయిన్స్ కి, మా సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మా టెక్నీషియన్స్ ప్రకాష్ గారు ప్రసాద్ గారు బీమ్స్ గారు కొరియోగ్రాఫర్స్ రైటర్స్ అందరికీ చాలా థాంక్స్. నేను రెండుసార్లు భ్రమరాంభ థియేటర్ కి వెళ్ళాను. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఉన్నాయి. తెలంగాణలో సింగిల్ స్క్రీన్సు 175, మల్టీప్లెక్స్ 200, ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ 195, మల్టీప్లెక్స్ 250 రూపీస్ ఉన్నాయి. అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయండి. మరో సక్సెస్ మీట్ లో కలుద్దాం.
డింపుల్, ఆషిక గ్లామర్ ట్రీట్ అదుర్స్!
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిగినింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులని నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. మేము అనుకున్న టార్గెట్ ని 100% రీచ్ అయ్యాం. ఆడియన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. సత్య గారు వెన్నెల కిషోర్ గారు సునీల్ గారు అన్ని పాత్రలు కూడా హిలేరియస్ గా ఉన్నాయి. నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు అని అంటారు. ఈ సినిమాతో ఆ ఆడియన్స్ డబుల్ అయ్యారు. ఈ సినిమా అందరికీ ఇంత బాగా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియో బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా బీమ్స్ కి వెళుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. కార్తీకదీపం, పిన్ని డీజే మిక్స్ సాంగ్స్ కి అందరూ మురిసిపోతున్నారు.ఆషిక ఇమేజ్ ని బ్రేక్ చేసిన క్యారెక్టర్ చేశారు. తను క్యారెక్టర్ లో బెస్ట్ ఇచ్చింది. అలాగే డింపుల్ ఇమేజ్ ని కూడా బ్రేక్ చేసిన క్యారెక్టర్ చేసింది. ఇద్దరు కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఈ స్క్రిప్ట్ లో పవన్ నాకు హెల్ప్ చేశాడు. ఈ టైటిల్ ఇచ్చింది కూడా తనే. చాలా మంచి టీం తో పని చేసాము. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత సుధాకర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫ్యామిలీతో పాటు వెళ్ళండి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సక్సెస్ మీట్ లో పబ్ సాంగ్ కి డాన్స్ చేస్తాను( నవ్వుతూ)రవితేజ గారికి నాకు పదేళ్ళుగా పరిచయం. ఎప్పటి నుంచో కలిసి పని చేయాలనుకుంటున్నాం. లక్కీగా ఇది కుదిరింది. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రవితేజ గారు. ఆయనకి ధన్యవాదాలు.
రవితేజ గారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


