
📌 Key Points
- రవితేజ హీరోగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
- చిత్ర ప్రమోషన్లలో భాగంగా సుమతో ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
- దర్శకుడు కిషోర్ తిరుమల బయోపిక్ అని వస్తున్న వార్తలను ఖండించారు.
- కిషోర్ తిరుమల తన తదుపరి సినిమా పెళ్ళికి ముందు జీవితం గురించి ఉంటుందని తెలిపారు.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల తన బయోపిక్ వార్తలపై స్పందించారు. తన తదుపరి సినిమా గురించి కూడా ఆయన వెల్లడించారు.
సంక్రాంతికి రవితేజ ‘BMW’ సందడి
BMW Film: మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW) సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయిన భర్త కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ మాట్లాడుతూ ఈ సినిమా గురించి నాకు ఒక రూమర్ వినిపించింది ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల బయోపిక్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి నిజమేనా? అంటూ సుమా ప్రశ్న వేయడంతో కిషోర్ తిరుమల సమాధానం చెబుతూ ఇది అసలు నా బయోపిక్ సినిమా కాదని తెలిపారు. అయితే రవితేజ మాత్రం ఈ విషయంపై మాట్లాడుతూ ఇది కిషోర్ బయోపిక్ సినిమా కాకపోయినా ఈ సినిమాపై కిషోర్ రియల్ లైఫ్ ఇంపాక్ట్ కొంతవరకు ఉంది అంటూ సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
దర్శకుడు కిషోర్ బయోపిక్ వార్తల్లో నిజమెంత?
ఇక ఇంటర్వ్యూలో భాగంగా తదుపరి చిత్రం గురించి కూడా కిషోర్ తిరుమల అప్డేట్ ఇచ్చారు .తన తదుపరి సినిమా నా పెళ్ళికి ముందు జరిగిన జీవితం గురించి ఒక సినిమా చేస్తాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటిసారి రవితేజతో కలిసి ఈయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సరికొత్త కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకుంటారని స్పష్టమవుతుంది.
భక్త మహాశయులకు విజ్ఞప్తి పైనే ఆశలు..
తదుపరి సినిమాపై కిషోర్ తిరుమల ప్రకటన
ఈ సినిమాలో సునీల్, తారక్ పొన్నప్ప, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. మరి జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇటీవల వరుస సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. గత కొద్ది రోజుల క్రితం మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.
మొత్తానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.


