|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RC 17: సుకుమార్ సంచలన ప్లాన్! రామ్ చరణ్ సినిమా రెండు భాగాలుగా రానుందా?

Published: 06-02-2026, 11:05 PM
RC 17: సుకుమార్ సంచలన ప్లాన్! రామ్ చరణ్ సినిమా రెండు భాగాలుగా రానుందా?
  • రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు, ఇది ఏప్రిల్‌లో విడుదల కానుంది.
  • సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా రెండు భాగాలుగా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
  • సుకుమార్ రామ్ చరణ్ కోసం ఒక క్లాస్ మరియు ఒక మాస్ కథను సిద్ధం చేశారని సమాచారం.
  • గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయం సాధించింది.

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

రామ్ చరణ్ బిజీ షెడ్యూల్

RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫ్రెండ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవి ఏప్రిల్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు.. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. గత కొద్ది రోజులుగా సుకుమార్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుందంటూ సమాచారం.. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సుకుమార్ మెగా ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అసలు సుకుమార్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో ఒకసారి చూసేద్దాం…

పెద్ది సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే చరణ్ మరోవైపు తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేశారు. పెద్ది తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో మూవీ రావడంతో మెగా ఫాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ ఉంది.. అయితే పుష్ప 2 లాగే రామ్ చరణ్ కోసం రెండు పార్ట్ లకు కథ సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి. రెగ్యులర్ స్టైల్ కు తగ్గట్టు ఓ క్లాస్ కథతో పాటూ, రంగస్థలం లాంటి ఓ మాస్ కథను కూడా రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది.. ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటంటే..

సుకుమార్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ

రెండు భాగాలుగా RC 17 మూవీ?

గతంలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరికలయికలో మరో మూవీ ఫిక్స్ అయ్యింది. అయితే దీన్ని రెండు పార్ట్ లుగా తీసేందుకు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే ఈ రెండు సినిమాలు మాస్ యాక్షన్ స్టోరీలతో రాబోతున్నడంతో మెగా ఫాన్స్ సినిమాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకేసారి రామ్ చరణ్ తో సుకుమార్ రెండు సినిమాలు తీయడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఈ వార్త కనుక నిజమైతే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. సుకుమార్ కథతో పాటూ చరణ్ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఈ ఇయర్ సమ్మర్ నుంచి సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లోగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ తో ఒక సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప 3 తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉండబోతున్నట్లు సమాచారం..

మొత్తానికి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.