|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రియల్‌మి నార్జో 100 లైట్ 5G: దిమ్మతిరిగే ఫీచర్లు! ఏప్రిల్ 14న విడుదల! ధర తెలిస్తే షాక్!

Published: 12-04-2026, 8:00 AM
రియల్‌మి నార్జో 100 లైట్ 5G: దిమ్మతిరిగే ఫీచర్లు! ఏప్రిల్ 14న విడుదల! ధర తెలిస్తే షాక్!
  • రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.
  • ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో వస్తుంది.
  • ధర రూ. 13వేల నుంచి రూ. 15వేల మధ్య ఉండవచ్చు.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

రియల్‌మి నుంచి కొత్త 5జీ ఫోన్ రాబోతోంది. నార్జో 100 లైట్ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆకట్టుకోనుంది. దీని ధర రూ.15,000 లోపే ఉంటుందని అంచనా.

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ: లాంచ్ తేదీ, సమయం

Realme Narzo 100 Lite 5G : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది. 7000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో రూ. 15వేల లోపు ధరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme Narzo 100 Lite 5G : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్ తేదీ ఖరారైంది. వచ్చే వారం ప్రారంభంలో ఈ 5జీ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ రియల్‌మి ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇందులో 7000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ రియల్‌మి ఇంకా అనేక ఇతర ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్‌కు ముందే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర ఎంత ఉండొచ్చు? అంచనాలు

భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్ తేదీ : రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ ఏప్రిల్ 14న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. రియల్‌మి అధికారిక సోషల్ మీడియా ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Best 5 SUV Cars : రూ. 20 లక్షల లోపు 5 బెస్ట్ SUV ఫ్యామిలీ కార్లు.. ఒక్కో కారు రేంజే వేరబ్బా.. ఎగబడి కొనేస్తున్నారు..!

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ధర : రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లీకుల ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 13వేల నుంచి రూ. 15వేల మధ్య ధరలో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా రియల్‌మీ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు : రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ 6.9-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ను అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 7000mAh టైటాన్ బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ 6 ఏళ్ల పాటు చెక్కుచెదరదు. ఈ ఫోన్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మి నార్జో 100 లైట్ 5G,మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 5300mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కంపెనీ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందించింది. ఈ ఫోన్ థండర్ బ్లాక్ ఫ్రాస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.