
📌 Key Points
- రేణు దేశాయ్ తన కుటుంబ నేపథ్యం గురించి యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
- ఆమెకు చిన్నప్పటి నుండి మోడలింగ్ అంటే ఇష్టమని, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు.
- ఆరోగ్య సమస్యల వల్ల తాను బరువు పెరిగానని, జన్యుపరంగా వచ్చిన హార్ట్ బీట్ సమస్య గురించి వివరించారు.
- రేణు దేశాయ్ కోటీశ్వరురాలు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ఆస్తులు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య సమస్యల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం గురించి రేణు దేశాయ్
Renu Desai : టాలీవుడ్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత అసలు ఇండస్ట్రీకి దూరమైంది. ఇన్నేళ్లకు మళ్లీ ఈమె రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మధ్య ఏదొక టాపిక్ వల్ల వార్తల్లో నిలుస్తుంది. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో తన ఆస్తులు, బిజినెస్ లతో పాటుగా వెయిట్ పెరగడానికి కారణాలను చెప్పింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
సినీనటి రేణు దేశాయ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటినుంచి తాత అలాగే నాన్న ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళని చెప్పింది. అయితే ఆ మాట వినగానే యాంకరు మీరు కోటీశ్వరులు అన్నమాట అని అడుగుతారు. దానికి రేణు దేశాయ్ ఏం చెప్పాలన్నా భయమేస్తుంది. ఎవరు ఏం రాసుకుంటారో తెలియట్లేదు అని రేణు దేశాయ్ అంటుంది.. పర్వాలేదు బాగానే ఉన్నాం అని సమాధానం చెప్పింది. అయితే నాకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అలా నేను మోడలింగ్ లోకి వచ్చేసాను అని ఆమె అన్నారు. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రావడంతో మెల్లగా సినిమాల్లోకి వచ్చినట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లాగా అనుకుంటున్నారు తప్ప ఎవరిది అన్నది ఇక్కడ ఎవరు ఆలోచించడం లేదు అని రేణు దేశాయ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ ఉద్దేశించి మాట్లాడింది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ కోటీశ్వరాలు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..
మోడలింగ్ నుండి సినిమా రంగంలోకి
అంతే కాదు ఆమె మాట్లాడుతూ తనకున్న అనారోగ్య సమస్య గురించి వివరించింది. అది ఫ్యామిలీలో జన్యుపరంగా వచ్చినట్లు చెప్పుకొచ్చింది. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, ఆయాసం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఆమెను వెంటాడుతున్నాయని చెప్పింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల తాను వెయిట్ పెరిగినట్లు చెప్పింది. కానీ నేను వెజిటేరియన్ కాబట్టి డైట్ ని ఫాలో అవుతూ కంట్రోల్ చేసుకుంటున్నాను అని ఆమె అంటున్నారు.
ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడానికి కారణం
పవన్ కళ్యాణ్ తో పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎటువంటి సినిమాల్లోనూ కనిపించలేదు. ఇక విడాకులు తర్వాత కూడా ఆమె సినిమాల్లో కనిపించాలని అనుకోలేదు. కేవలం పిల్లల్ని చూసుకుంటూ తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్ళేది. అయితే ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విషయాన్ని ఎన్నాళ్ల తర్వాత బయటపెట్టింది. ప్రస్తుతం నేను అందులో బిజీగా ఉన్నాను అని అన్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నాకు నచ్చిన క్యారెక్టర్ గనుక వస్తే కచ్చితంగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని రేణు దేశాయ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి..
రేణు దేశాయ్ తన జీవితంలోని అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ, తన కెరీర్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


