|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంతార 3పై నీలినీడలు! రిషబ్ కొత్త షరతులతో హోంబలే ఫిల్మ్స్ డైలమాలో?

Published: 10-04-2026, 6:35 AM
కాంతార 3పై నీలినీడలు! రిషబ్ కొత్త షరతులతో హోంబలే ఫిల్మ్స్ డైలమాలో?
  • ‘కాంతార’ సినిమా 16 కోట్ల బడ్జెట్‌తో 400 కోట్లు వసూలు చేసింది, నేషనల్ అవార్డు గెలుచుకుంది.
  • ‘కాంతారా చాప్టర్ 1’ ఏకంగా 850 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
  • మూడో భాగంలో తన భార్యను కో ప్రొడ్యూసర్‌గా చేయాలని రిషబ్ హోంబలే ఫిల్మ్స్‌ను కోరినట్లు సమాచారం.
  • హోంబలే ఫిల్మ్స్ పెద్ద ప్రాజెక్ట్స్ నిర్మించే సామర్థ్యం కలిగి ఉంది, రిషబ్ డిమాండ్‌కు తలొగ్గుతుందా అనేది అనుమానంగా ఉంది.

రిషబ్ శెట్టి హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాల కారణంగా ‘కాంతారా 3’ ఆగిపోయే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ తన భార్యను కో ప్రొడ్యూసర్‌గా తీసుకోవాలని, నిర్మాణంలో వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

కాంతార సక్సెస్ వెనుక అసలు కథేంటి?

Kantara 3 : కాంతారా.. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ అయిన సినిమాతో 400 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా నేషనల్ అవార్డ్ తీసుకొని ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్ కొట్టేశాడు రిషబ్ శెట్టి. ఇక కాంతారా కి ప్రీక్వెల్ అంటూ అక్టోబర్ 2, 2025 న రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 ఏకంగా 850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండిట్స్ కి పెద్ద షాకే  ఇచ్చాడు. అలా కాంతారా సిరీస్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు సెన్సేషన్ హిట్ కావడంతో మూడో భాగం ఎప్పుడొస్తుందా అంటూ కళ్ళు కాయేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇపుడు పెద్ద షాకే తగిలేలా ఉంది. అవును.. కాంతారా మూడో భాగం ఇపుడు సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోనుందన్న వార్తలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయ్.

క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికినా ?

నిజానికి హోంబలే ఫిల్మ్స్‌పైనే విజయ్ కిరగందూర్ ఈ రెండు సినిమాలు తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఇక కాంతారా క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి రిషబ్ శెట్టి అండ్ టీమ్ కూడా రెడీ అయిపొయింది. అందులో భాగంగా మూడో భాగం కూడా ఉంటుందని రిషబ్ దైవ నిర్ణయం తీసుకున్నాడు కూడా. అయితే ఇపుడు సినిమా ఇక ఉండబోతుందని అనౌన్స్ చేసే ఈ టైమ్ లో రిషబ్ హోంబలే ఫిల్మ్స్‌ ముందు సరికొత్త డిమాండ్ పెట్టాడట.

మూడో భాగంలో రిషబ్ కొత్త డిమాండ్లేంటి?

కాంతారా మూడో భాగంలో తనకు వాటా

అవును.. పార్ట్ ౩ నిర్మాణంలో తన భార్య ప్రగతి శెట్టిని కో ప్రొడ్యూసర్ గా తీసుకోవాలని,ప్రస్తుతం తన మార్కెట్ భారీగా పెరిగినందున కాంతారా మూడో భాగంలో తనకు వాటా కావాలని పట్టుబడుతున్నాడని శాండల్ వుడ్లో వినిపిస్తున్న టాక్. అయితే అడగడం వరకు బాగానే ఉంది కాని, ఆల్రెడీ అన్నీ డిస్కషన్స్ అయిపోయి,అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత రిషబ్ ఇలా కొత్త మెలిక పెట్టడం ఏంటన్నది ఇక్కడ హోంబలే ఫిల్మ్స్‌ వారి ఆర్గ్యుమెంట్.

కాంతారా మూడో భాగం అటకెక్కుతున్నట్టే

అయితే తమకు తాముగానే పెద్ద ప్రాజెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసే హోంబలే ఫిల్మ్స్ రిషబ్ పెడుతున్న ఈ డిమాండ్ కి తలొగ్గి రిషబ్ భార్యని పార్ట్నర్ గా చేసుకుంటారా అంటే అనుమానమే. మొత్తానికి హీరో,ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతున్న ఈ ఫైనాన్సిషియల్ వార్ చూస్తుంటే కాంతారా మూడో భాగం అటకెక్కుతున్నట్టే కనిపిస్తుంది.

హోంబలే ఫిల్మ్స్ నిర్ణయం ఏంటి? సినిమా ఆగుతుందా?

మొదలేయ్యేముందు కొత్త మెలిక

ఇక నటీనటుల విషయానికి వస్తే కాంతారాలో రిషబ్ సరసన సప్తమీ గౌడ నటిస్తే  చాప్టర్ 1లో యువరాణి కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ మెరిసిన సంగతి తెల్సిందే .ఏది ఏమైనా సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్న రిషబ్ ఇలా సినిమా మొదలేయ్యేముందు కొత్త మెలిక పెట్టడం ఏం బాగోలేదన్నది చాలా మంది వాదన.చూడాలి మరి పెట్టిన డిమాండ్ తీరకపోతే సినిమా మరో బ్యానర్ కి వెళ్తుందా లేక హోంబలేనే మరో హీరోని వెతుక్కుంటుందా !

హీరో మరియు ప్రొడ్యూసర్ మధ్య జరుగుతున్న ఈ వివాదం కాంతారా మూడో భాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వార్తల వెనుక నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.