
📌 Key Points
- నటి రోజా ‘అన్బే డయానా’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
- జమ సినిమా ఫేమ్ పారిఇళవళగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
- ఈ చిత్రంలో రోజా గృహిణి పాత్రలో నటిస్తున్నారు, టీజర్ విడుదల అయింది.
- మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఏడవ చిత్రం ఇది.
ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా రాజకీయాల తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ‘అన్బే డయానా’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.
రోజా రీ ఎంట్రీ చిత్రం: ‘అన్బే డయానా’
RK Roja:ఒకప్పుడు సినిమాలలో తమ అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సీనియర్ హీరోలు, హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే రాధిక శరత్ కుమార్ రీ ఎంట్రీ లో డి గ్లామరస్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఒకప్పుడు తెలుగు, తమిళ్ తదితర భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటి రోజా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈమె మంత్రిగా కూడా పనిచేసింది. ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగుతున్న రోజా మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమైపోయింది.
నటి రోజా ప్రధాన పాత్ర పోషిస్తూ ‘అన్బే డయానా ‘ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జమ సినిమా ఫేమ్ పారిఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తూనే.. స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య రంగనాథన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో యూట్యూబర్ పరితాపంగల్ గోపి, సుదర్శన్ , గాంధీ చేతన్, సెల్ మురుగన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్ , టూరిస్ట్ ఫ్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఏడవ చిత్రం కావడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. చెన్నైని మరో కోణంలో ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.
టీజర్ విడుదల: రోజా నటనకు ప్రశంసలు
చిత్ర విశేషాలు: ప్రేమ, వినోదం, మత విభేదాలు
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇందులో రోజా పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి ..ముఖ్యంగా రోజా ఇందులో ఒక గృహిణి పాత్రలో కనిపిస్తోంది. అదే జోష్.. అదే స్పీడ్ రీ ఎంట్రీలో అదరగొట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రీ ఎంట్రీ లో మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది రోజా. మరి ఈ రీ ఎంట్రీతో రోజా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రేమ, వినోదం, మత విభేదాలు వంటి అంశాలతో చాలా కొత్తగా రూపుదిద్దుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉత్తర చెన్నైలోని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే ఘటనల ఇతివృతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీజర్ నుంచి ప్రేక్షకులకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ , ఆడియో రిలీజ్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే రోజా రీ ఎంట్రీనీ తెలుగు కాకుండా తమిళ్ నుండి ప్రారంభించారు.
మొత్తానికి రోజా తన రీ ఎంట్రీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రేమ, వినోదం, మత విభేదాల అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


