
📌 Key Points
- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు గుంత కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కోలుకున్నారు.
- కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
- రోడ్డు గుంత వలన కలిగిన కుదుపుతో ఆమెలో తిరిగి చలనం వచ్చింది.
- వైద్యులు దీనిని మిస్ డయాగ్నోసిస్ అని కొందరు, దేవుని మహిమ అని మరికొందరు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ, అంబులెన్స్ రోడ్డు గుంతను ఢీకొనడంతో తిరిగి స్పృహలోకి వచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
బ్రెయిన్ డెడ్ అయిన మహిళ
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఒక వింత ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా “పాత్ హోల్ మిరాకిల్” (Pothole Miracle) పేరుతో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మారుమోగిపోతోంది. యూపీలోని పిలిభిత్ నివాసి అయిన 50 ఏళ్ల వినీతా శుక్లా అనే మహిళ, ఫిబ్రవరి 22న తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ‘బ్రెయిన్ డెడ్’ కు గురైందని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆమె బతికే అవకాశాలు లేవని వైద్యులు స్పష్టం చేయడంతో, తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా.. బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారి(NH-74) పై హఫీజ్‌గంజ్ సమీపంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అంబులెన్స్ వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఒక భారీ గుంత (Pothole) కారణంగా అంబులెన్స్ తీవ్రమైన కుదుపునకు లోనైంది. ఈ బలమైన కుదుపు వల్ల, అప్పటివరకు అపస్మారక స్థితిలో ఉండి చనిపోయిందని భావించిన వినీతా శుక్లా శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆమె శ్వాస తీసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించగా.. పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై వైద్య వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినీతా శుక్లా కుటుంబ సభ్యులు దీనిని దేవుని మహిమ అంటుండగా.., వైద్య నిపుణులు మాత్రం “మిస్ డయాగ్నోసిస్” అయి ఉండవచ్చని అంటున్నారు. ఈ విచిత్రమైన ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రోడ్డు గుంతతో తిరిగొచ్చిన చలనం
వైద్యుల విశ్లేషణలు, కుటుంబ సభ్యుల నమ్మకం
ఈ సంఘటన వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది దైవలీలగా కొందరు భావిస్తుంటే, వైద్యపరమైన తప్పిదంగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా, ఆ మహిళ తిరిగి కోలుకోవడం సంతోషకరమైన విషయం.


