|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయణంలో సీతగా సాయి పల్లవి: రెమ్యూనరేషన్ తక్కువే అయినా పాత్రకు న్యాయం చేస్తారా?

Published: 15-04-2026, 1:35 PM
రామాయణంలో సీతగా సాయి పల్లవి: రెమ్యూనరేషన్ తక్కువే అయినా పాత్రకు న్యాయం చేస్తారా?
  • రామాయణంలో సీత పాత్రకు సాయి పల్లవి రూ. 12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
  • రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లు.
  • రావణుడిగా యష్ రూ. 100 కోట్లు, హనుమంతుడిగా సన్నీ డియోల్ రూ. 40 కోట్లు తీసుకుంటున్నారు.
  • సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న రామాయణ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నప్పటికీ, ఆమె రెమ్యూనరేషన్ తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మిగతా నటుల రెమ్యూనరేషన్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

సాయి పల్లవి రెమ్యూనరేషన్ పై చర్చ

Sai Pallavi: 4000 కోట్ల భారీ బడ్జెట్ అంటే హీరోయిన్ కి ఎంతుండాలి.తక్కువలో తక్కువ 50 నుండి వంద కోట్లయినా ఉండాలి.కానీ భారీ బడ్జెట్ అంటూ ఊదరగొడుతున్న రామాయణ సినిమా కి ను హీరోయిన్ సాయి పల్లవికి అందుతున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.అవును ఈ సినిమా కోసం పల్లూ అందుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 12 కోట్లు మాత్రమేనన్న న్యూస్ ఇపుడు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా నిప్పు లేకుండా పొగ రాదుగా అంటూ తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

తండేల్’ సినిమాకే ఆమె 5 కోట్లు

నిజానికి నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ లో వచ్చిన తండేల్’ సినిమాకే ఆమె 5 కోట్లు తీసుకుందన్న వార్తలు వినిపించాయ్.అలాంటిది ఇంత భారీ బడ్జెట్ సినిమాలో, సీతమ్మ వంటి కీలక పాత్రకు రెండు పార్టులకు కలిపి కేవలం 12 కోట్లు అన్న వార్తలు వినిపించడం కాస్త ఆశ్చర్యమే. మా టార్గెట్ 10 వేల కోట్లు అంటూ మేకర్స్ ఊదరగొడుతున్నారు.ఒక వేళ రెమ్యూనరేషన్ మరీ ఈ స్థాయిలో ఇస్తే మాత్రం అది పెద్ద షాకే.ఇదిలా ఉంటె సినిమా షూటింగ్ షెడ్యూల్స్ విషయానికి వస్తే, 2024 ఏప్రిల్‌లోనే ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెల్సిందే.

రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్‌కు 150 కోట్లు

రామాయణం సినిమా బడ్జెట్ వివరాలు

ప్రస్తుతం 2026 ఏప్రిల్ నాటికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో బిజీగా ఉందని సమాచారం. మొదటి భాగం 2026 అక్టోబర్‌లో దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కూడా.మరి ఇదే చిత్రానికి రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్‌కు 150 కోట్లు, రావణుడిగా యష్‌కు 100 కోట్లు, హనుమంతుడిగా సన్నీ డియోల్‌కు 40 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సాయి పల్లవికి అందేది చాలా తక్కువ అనే చెప్పాలి.

రెమ్యూనరేషన్లు అన్నీ కలిపి 550 కోట్ల లోపే

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం డైరెక్టర్, టెక్నీషియన్లు, మిగతా ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు అన్నీ కలిపి 550 కోట్ల లోపే ఉండవచ్చట.అంటే ఈ 4000 కోట్ల భారీ బడ్జెట్‌లో మెజారిటీ కేవలం క్వాలిటీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసమే ఖర్చు చేస్తున్నారన్న మాట.ఇక ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నది ప్రపంచ ప్రఖ్యాత సంస్థ DNEGఅన్న సంగతి తెల్సిందే.ఇక ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఈ కంపెనీని నడిపిస్తున్న సీఈఓ నమిత్ మల్హోత్రానే ఈ రామాయణ చిత్రానికి ప్రొడ్యూసర్ కూడా. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెనుక ఉన్న అసలు లెక్క ఇంటర్నేషనల్ గా మన ఇతిహసాన్ని గ్రాండియర్ గా పరిచయం చేయడమే అని ఇప్పటికే చెప్పాడు కూడా.

రణబీర్, యష్‌ల రెమ్యూనరేషన్లు

ప్రధాన కారణం అది ‘సీత’ పాత్ర కావడమే

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె ఈ తక్కువ రెమ్యూనరేషన్‌కు ఓకే చెబితే మాత్రం దానికి ప్రధాన కారణం అది ‘సీత’ పాత్ర కావడమే మొదటి నుంచి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకునే సాయి పల్లవి, రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా పట్టుబట్టరనే పేరు ఇండస్ట్రీలో ఉంది. కెరీర్ పరంగా చూస్తే సీత పాత్రలో నటించడం ఆమెకు ఒక గొప్ప అవకాశం. పైగా హీరోలతో పోలిస్తే ఆమె కాల్షీట్లు కూడా తక్కువగానే ఉండవచ్చు.అయితే 2026 చివరి నాటికి సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆమె రేంజ్ మారిపోవడం ఖాయం. అంటే ఈ ప్రాజెక్ట్ తో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ కి గురిపెట్టబోతుందన్న మాట!

సాయి పల్లవి రెమ్యూనరేషన్ తక్కువైనా సీత పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.