|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం! టాలీవుడ్ దర్శకుడితో భారీ చిత్రం.. అసలేం జరుగుతోంది?

Published: 30-03-2026, 4:35 AM
సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం! టాలీవుడ్ దర్శకుడితో భారీ చిత్రం.. అసలేం జరుగుతోంది?
  • సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో భారీ చిత్రం
  • ఏప్రిల్ 2026లో సినిమా షూటింగ్ ప్రారంభం, 2027 ఈద్‌కి విడుదల
  • నయనతార హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించే అవకాశం
  • హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదల కానున్న చిత్రం

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో భారీ చిత్రం

Salman Vamshi: బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో రూట్ మారుస్తున్నారు. వరుసగా సౌత్ దర్శకులతో పని చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో పక్కా కమర్షియల్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సల్మాన్ ఒక భారీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగులో మహేష్ బాబు మహర్షి తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్ తో వారీసు సినిమా తీశారు. ప్రస్తుతం బాలీవుడ్ బడా స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు.

Read also- సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్న పెళ్లి రూమర్స్.. మొన్న సాయి పల్లవి.. నిన్న అనుష్క.. నేడు?

ఈ చిత్రం పూర్తిస్థాయి హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందిని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో బలమైన ఎమోషన్స్‌తో పాటు గ్రాండ్ విజువల్స్ ఉండేలా చూసుకుంటారు. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి సినిమాల తర్వాత వంశీ ఈసారి సల్మాన్ ఖాన్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్‌ను గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సల్మాన్ ఖన్ తెలుగులో గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం తెలుగు హిట్ దర్శకుడికి డేట్స్ ఇవ్వడంతో సల్మాన్ భాయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

షూటింగ్ ఎప్పుడు ప్రారంభం, విడుదల ఎప్పుడు?

Read also- రంగస్థలం @8ఏళ్లు.. ఎవరికి తెలియని తెరవెనుక విషయాలు?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుంది. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసి, 2027 ఈద్ కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఒక కీలక పాత్రలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా కనిపిస్తారని సమాచారం. హిందీ, తెలుగు భాషలతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘మాతృభూమి’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి ప్రాజెక్టులోకి అడుగుపెడతారు. టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌లో సల్మాన్ ఖాన్‌ను చూడటం అభిమానులకు ఖచ్చితంగా కళ్ల పండగే అని చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

It gives us great pride to collaborate with a phenomenon like you @BeingSalmanKhan sir.. ❤️

హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటులు ఎవరు?

We will give it everything to create something massive along with our dearest @directorvamshi garu 💥

Counting down for #SalmanKhanVamshiPaidipallyFilm . See you on the sets this April 😍… https://t.co/Nbpq5Phita

— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2026

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.