|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ విషయం గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

Published: 17-07-2025, 5:22 AM
ఆ విషయం గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. లద్దాఖ్‌లోని కఠినమైన వాతావరణంలో చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు.

Key Points

1

సల్మాన్ ఖాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' షూటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

2

లద్దాఖ్‌లోని కఠినమైన వాతావరణంలో షూటింగ్ జరుగుతుంది.

4

ఈ షూటింగ్ గురించి ఆయనకు భయంగా ఉందని వెల్లడించారు.

‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ షూటింగ్ వివరాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan). అపూర్వ అఖియా(Apurva Akhiya) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ చిత్రంగద సింగ్(Chitragada Singh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గల్వాన్ లోయలో భారతదేశం, పాకిస్తాన్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి ఫస్ట్ విడుదలవగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని అంచనాలను పెంచేసింది.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ షూటింగ్ మరో 10 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఎంతో కష్టమైన ప్రాంతాల్లో దీని చిత్రీకరణ చేయనున్నారు. లద్దాఖ్‌లోని కొన్ని లోకేషన్స్‌లో కీలక సన్నివేశాలు చేయనున్నారు. గడ్డకట్టే చలిలో నేను 8 రోజులపాటు నీటలో షూటింగ్ చేయబోతున్నాను. ఈ విషయం తలుచుకుంటేనే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. అయినా నేను ఇందులో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షూటింగ్ ఈ రేంజ్‌లో చేస్తే సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లద్దాఖ్‌లో కష్టతరమైన చిత్రీకరణ

సల్మాన్ ఖాన్ భయం వెల్లడి

చిత్రీకరణలోని కష్టాలను సల్మాన్ ఖాన్ పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. సినిమా విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.