
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు దర్శకుడు రాజ్ నిడిమోరుల మధ్య రిలేషన్షిప్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
Key Points
సమంత మరియు రాజ్ నిడిమోరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్.
సమంత భుజంపై రాజ్ చేయి వేసి ఉన్న ఫోటో నెటిజన్లను ఆకర్షించింది.
వీరిద్దరి రిలేషన్షిప్ గురించి వార్తలు ఇటీవల పెరిగాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో
స్టార్ హీరోయిన్ కమ్ నిర్మాత సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(/ye maya Chesave) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఇందులో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య గత ఏడాది హీరోయిన్ శోభిత(Shobitha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం మరో మ్యారేజ్ చేసుకోలేదు.
కానీ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో మాత్రం డేటింగ్‌లో ఉందనే వార్తలు నిత్యం సోషల్ మీడియా(Social Media)లో కూడా కూస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సామ్ తన ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ చేయడంతో ఆ వార్తలకు ఆజ్యం పోయినట్లయింది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరు వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫొటోస్‌లో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేసి వేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వీరిద్దరిని అంత క్లోజ్‌గా చూడడంతో కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link
నెటిజన్ల అభినందనలు
రిలేషన్షిప్ గురించి వార్తలు
సమంత మరియు రాజ్ నిడిమోరుల రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి ఫోటో వైరల్ అవడంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


