|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్! రాజ్ గురించి ఏం చెప్పిందంటే?

Published: 23-02-2026, 7:35 AM
సమంత రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్! రాజ్ గురించి ఏం చెప్పిందంటే?
  • సమంత, రాజ్ నిడిమోరుల వివాహం 2025 డిసెంబర్ 1న జరిగింది.
  • విడాకుల తర్వాత రాజ్ తన జీవితంలోకి రావడంతో సంతోషంగా ఉన్నానని సమంత తెలిపింది.
  • సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నారు.
  • రాజ్ తన కెరీర్‌లో సమంతకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.

సమంత, రాజ్ నిడిమోరుల వివాహం గురించి సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన విడాకుల తర్వాత రాజ్ తన జీవితంలోకి రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపింది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్నారు.

సమంత, రాజ్ నిడిమోరుల వివాహం

Samantha -Raj Nidimoru: సమంత తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సమంత కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పాలి. సమంత వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదే. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే సమంత నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడటం ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కావడం జరిగింది.

పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇలా సమంత సింగిల్ గా ఉంటూనే 2025 డిసెంబర్ ఒకటవ తేదీ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా తన వైవాహిక జీవితం అనంతరం సమంత ఎంతో సంతోషంగా కనబడుతున్నారు. తాజాగా సమంత వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన మొదటి పెళ్లి విడాకులు రెండో పెళ్లి గురించి ఈమె ప్రస్తావించినట్టు తెలుస్తుంది.

విడాకుల తర్వాత సమంత జీవితంలో మార్పు

తాను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయానని, తన జీవితంలో మరొక వ్యక్తిని నమ్మి అతనితో కలిసి ముందుకు నడుస్తానని కలలో కూడా అనుకోలేదు. విడాకుల తర్వాత మానసికంగా నేను చాలా కృంగిపోయాను ఎవరి ప్రేమ, స్నేహాన్ని కూడా పొందే పరిస్థితులలో నేను లేను అలాంటి సమయంలోనే రాజ్ నా జీవితంలోకి వచ్చారు. ఆయన తన జీవితంలోకి రావడంతో నాకు తెలియకుండానే నేను సంతోషంగా ఉన్నాను. నాలో తెలియని శక్తి వచ్చింది ఇదంతా కూడా రాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని తను వచ్చిన తర్వాత నా జీవితం చాలా సంతోషంగా మారిపోయిందని తెలిపారు.

‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత

ఇలా రెండో పెళ్లి తర్వాత సమంత చాలా సంతోషంగా ఉన్నాననే విషయాన్ని తెలియజేయడంతో ఈమె అభిమానులు కూడా ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తూ ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుండగా ఆమెకు పూర్తిస్థాయిలో రాజ్ మద్దతు తెలియజేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థలు తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం (Maa Inti Bangaram)అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇటీవల విడుదల తేదీని ప్రకటించారు.

సమంత తన జీవితంలో రాజ్ రాకతో సంతోషంగా ఉన్నానని చెప్పడం ఆమె అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె రాబోయే సినిమాలతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.