|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అభిమానుల అత్యుత్సాహం: సమంతకు ఊహించని అనుభవం, కిందపడబోయిన వీడియో వైరల్!

Published: 21-12-2025, 10:04 PM
అభిమానుల అత్యుత్సాహం: సమంతకు ఊహించని అనుభవం, కిందపడబోయిన వీడియో వైరల్!
  • షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అభిమానుల అత్యుత్సాహం కారణంగా సమంత ఇబ్బంది పడింది.
  • ఆమె చీర తొక్కడంతో కింద పడబోయిన దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.
  • నిధి అగర్వాల్ ఘటన తర్వాత ఇలాంటి అనుభవమే మరో స్టార్ హీరోయిన్‌కు ఎదురైంది.
  • ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ నిర్వాహకుల భద్రతా లోపాలపై మండిపడుతున్నారు.

ఈ మధ్య సెలబ్రిటీలకు అభిమానుల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఇలాంటి సంఘటన ఎదురైంది. అభిమానుల తాకిడిలో కిందపడబోయిన ఆమె వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమంతకు ఎదురైన చేదు అనుభవం

ఇటీవల అభిమానుల ప్రవర్తన తీరు సెలబ్రిటీల్లో భయాందోళనకు గురి చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అభిమానుల అత్యుత్సాహం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ‘ది రాజాసాబ్’ నిధి అగర్వాల్‌‌(Nidhi Agarwal)పై లూలూ మాల్‌లో కొందరు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha). ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సామ్ ఈవెంట్ పూర్తయ్యాక బయటకు వెళ్లే సమయంలో అభిమానుల గుంపు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరింది. సెల్ఫీల కోసం సమంతను తాకేందుకు ప్రయత్నించారు. ఇక అది గమనించిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. తన పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ బయటకు వచ్చేసింది.

ఈక్రమంలోనే.. ఆమె చీరను ఎవరో తొక్కడంతో.. సమంత కింద పడుతుండగా.. చివరి నిమిషంలో సెక్యూరిటీ సాయంతో కారు వద్దకి వెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం దారుణం అంటూ మండిపడుతున్నారు. మొన్న నిధికి, ఈరోజు సమంత ఇలా జరగడానికి కారణం కార్యక్రమా నిర్వాహకులను తిడుతున్నారు. హీరోయిన్లను పిలిచినప్పుడు వాళ్లని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్య నిర్వాహకుల మీద ఉంటుందని.. కానీ వాళ్లు సెక్యూరిటీని పెంచకపోవడం వల్లే హీరోయిన్లను రక్షణ లేకుండా పోతుందని అంటున్నారు. ప్రస్తుతం నిధి, సమంత సంఘటనలు సోషల్ మీడియాతో హాట్ టాపిక్‌గా మారాయి. ఇలాంటి కార్యక్రమాలు హాజరైనప్పుడు హీరోయిన్లు అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా.. సమంత డిసెంబర్ 1న తన ప్రియుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై నెలరోజులు కూడా కాకముందే సామ్ బ్యాక్ టూ వర్క్ అంటూ షూటింగ్స్, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

నెటిజన్ల ఆగ్రహం, నిర్వాహకులపై విమర్శలు

నిధి అగర్వాల్ ఘటన మరువకముందే సమంతకు ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. సెలబ్రిటీల భద్రతకు నిర్వాహకులు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, అభిమానులు కూడా సంయమనం పాటించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.