|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’: శివాజీ, లయల చిత్రం.. ట్రైలర్ చూస్తే షాక్!

Published: 02-03-2026, 8:05 AM
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’: శివాజీ, లయల చిత్రం.. ట్రైలర్ చూస్తే షాక్!
  • శివాజీ, లయ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.
  • ఈ సినిమాను ఈటీవీ విన్‌తో కలిసి బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు.
  • క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • మార్చి 6న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

శివాజీ, లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

Sampradayini Suppini Suddapoosani: శివాజీ (Sivaji), లయ (Laya) కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్. వారిద్దరి కలయికలో ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరిట ఓ వీడియోను మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.

అసలు ఈ సినిమాను ఓటీటీ ఈటీవీ విన్ కోసమని రూపొందించారు. కంటెంట్ బాగా రావడంతో థియేటర్లకు షిఫ్ట్ చేశారు. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీనే స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ సినిమా 2026, మార్చి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపత్యంలో వచ్చిన రిలీజ్ ట్రైలర్ (Sampradayini Suppini Suddapoosani Release Trailer) ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూ.. ఆసక్తిని పెంచుతోంది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు. వారి కుమారుడుగా రోహన్ (90స్ ఫేమ్) ఇందులో ఓ కీలక పాత్ర పోషించినట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది. ఎంతో అమాయకంగా, సాంప్రదాయబద్ధంగా జీవించే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం.. అనుకోకుండా విచిత్రమైన, ఊహించని నేరాల్లో ఎలా ఇరుక్కుంది..? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది.

శివాజీ, లయల కలయికలో మరో చిత్రం

శివాజీ పాత్ర కంటే కూడా ఇందులో లయ పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులోనూ ఫస్ట్ టైమ్ లయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తూనే, కడుపుబ్బా నవ్వించినట్లుగా ఈ ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది. అంతే కాకుండా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేది కూడా ఆమె పాత్రనే అని అర్థమవుతోంది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథకు తీసుకున్న ఆర్టిస్ట్‌లు బాగా సెట్ అయ్యారు. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్‌కు రంజిన్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ కామెడీ అనుభూతిని పంచనుందని.. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ 100 శాతం తెలియజేశాయి. చూద్దాం మరి.. మార్చి 6న ఈ చిత్రం థియటర్లలో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో..

Our Crazy family is coming to entertain yours..❤️❤️

Enjoy #SampradayiniSuppiniSuddapoosani only premieres in overseas from March 5 #SSS #SSSonMarch6th

క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా చిత్రం

Overseas by #AtharvanaBhadrakaliPictures pic.twitter.com/dgi0yVnPwK

— Atharvana Bhadrakali Pictures (@AtharvanaGlobal) March 2, 2026

మొత్తానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. శివాజీ, లయల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేలా ఉంది. మార్చి 6న సినిమా విడుదల కోసం ఎదురుచూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.