
📌 Key Points
- విజయ్, త్రిషల రిలేషన్‌పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు.
- విజయ్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే వివాదాలు.
- పూజా కార్యక్రమంలో బాల, ఉదయ్ కుమార్ లతో సముద్రఖని చర్చ.
- బహిరంగ ప్రదేశాల్లో త్రిషతో విజయ్ కనిపించడంపై ఆగ్రహం.
దర్శకుడు సముద్రఖని, విజయ్ దళపతి మరియు త్రిషల మధ్య సంబంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
విజయ్, త్రిషల రిలేషన్‌పై సముద్రఖని ఆగ్రహం
Samuthirakani:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు దక్కించుకొని.. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూ.. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సముద్ర ఖని(Samuthira kani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన తాజాగా విజయ్ దళపతి (Vijay Thalapathy) పై, ఆయన రిలేషన్షిప్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా పేరు దక్కించుకున్న విజయ్ దళపతి అటు తమిళ రాజకీయాలలో కూడా చురుగ్గా ఉంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.. ఒకవైపు ఆయన కుటుంబ సమస్యలు కోర్టు వరకు వెళ్తే .. మరొకవైపు నటి త్రిష (Trisha) తో కలసి ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో ప్రకంపనుల సృష్టించాయి. ఇన్ని రూమర్స్ వస్తున్న వేళ.. ఆయన మళ్లీ త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై దర్శకుడు సముద్రకని ఆవేదనను , కోపాన్ని వ్యక్తం చేస్తూ విజయ్ దళపతి పై మండిపడ్డారు.
రాజకీయాల్లో విజయ్.. వ్యక్తిగత వివాదాలు
ఒక సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న సముద్రఖని, దర్శకులు బాల, ఆర్ వి ఉదయ్ కుమార్ లతో మాట్లాడుతూ విజయ్ ప్రవర్తన పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.” ఇదేమైనా ఆటలా.. ఇన్ని జరుగుతున్నా కూడా ఆమెను ఎందుకు బయటకు తీసుకొస్తారు? నాలుగు గోడల మధ్య ఉంచుకోవచ్చు కదా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు?” అంటూ సముద్రఖని కోపంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా విజయ్ కావాలనే ఇలా త్రిషను మాటిమాటికి బహిరంగ ప్రదేశాలకు తీసుకొస్తున్నాడు అంటే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సముద్రఖని.
సముద్రఖని వ్యాఖ్యలు వైరల్
ఇకపోతే విజయ్ స్థాపించిన తమిళగ వెంట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత వివాదాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై లేదా ఓటు బ్యాంకు పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయనే ఆందోళన ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ప్రారంభంలో విజయ్ రాజకీయాల్లోకి రావడానికి మనస్ఫూర్తిగా ఆహ్వానించిన సముద్రఖని ఇప్పుడు ఇలా విమర్శించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు ఆయన రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ పడేలా ఉన్నాయనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి మునుముందు కాలంలో విజయ్ వీటన్నింటిపై స్పందిస్తారా లేక తనకేమీ పట్టనట్టు ఉండిపోతారా అన్నది చూడాలి. ఇక రాజకీయ జీవితమే ప్రధాన లక్ష్యంగా ముందడుగు వేస్తున్న విజయ్ కి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.
సముద్రఖని వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ భవిష్యత్తుపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


