|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార కన్నీళ్లు.. స్టేజిపై భర్తను హత్తుకుని ఓదార్పు! వైరల్ వీడియో కలకలం!

Published: 08-04-2026, 3:05 AM
నయనతార కన్నీళ్లు.. స్టేజిపై భర్తను హత్తుకుని ఓదార్పు! వైరల్ వీడియో కలకలం!
  • నయనతార నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
  • భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ స్పీచ్ ఇస్తుండగా నయనతార స్టేజిపైకి వచ్చి ఓదార్చింది.
  • నయనతార భర్తను హత్తుకుని ఓదారుస్తుండగా విగ్నేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
  • నయన్ తన భర్తకు అండగా నిలబడటంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ ఒక వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు. విగ్నేష్ మాట్లాడుతుండగా నయనతార స్టేజిపైకి వచ్చి అతన్ని ఓదార్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Nayanatara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ బాస్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. ఒక మాటలో చెప్పాలంటే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. వయసు పెరుగుతున్న తరగని అందంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈమె గురించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోలో నయనతార తన భర్త ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాన్ని చూడవచ్చు.. ఇంతకీ వీళ్లిద్దరూ అంతగా ఎమోషనల్ అవ్వడానికి అందులో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తమిళ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ క్రేజ్ ను అందుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ లలో విగ్నేష్ శివన్ దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి హీరోయిన్ నయనతార నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రీసెంట్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో దర్శకుడు విగ్నేష్ శివన్ మాట్లాడుతుండగా నయనతార సడెన్ గా స్టేజిపైకి వచ్చి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది.. స్టేజ్ మీదకు వచ్చిన నయన్ తన భర్తని కౌగలించుకొని ఓదార్చింది. దీంతో విగ్నేష్ మరింత ఎమోషనల్ అయి ఏడ్చేశాడు.. ఇలా భార్య భర్తల బంధం స్టేజిపై చూపించడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. భర్తకి ఎమోషనల్ సపోర్ట్ గా నయనతార నిలబడిందని నయన్ ఫ్యాన్స్, నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి..

భర్తను ఓదార్చిన నయనతార

హీరోయిన్ నయనతార సీనియర్ హీరోలకు ఆప్షన్ గా మారింది.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిరంజీవి సినిమాలో నటించి బిగ్గెస్ట్ హెడ్ ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటుగా ఈమె ఇప్పుడు మరో రెండు, మూడు సినిమాలుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం నందమూరి హీరో బాలయ్య నటిస్తున్న ఓ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది.. దీంతో పాటుగా మరో భారీ ప్రాజెక్టులో ఈమె నటిస్తుందని సమాచారం. మరి త్వరలోనే ఆ మూవీ పూర్తి వివరాలను వెళ్లండించే అవకాశాలు ఉన్నాయి.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మా హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో

#LIK -; #Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J

— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026

నయనతార, విగ్నేష్‌ల మధ్య ఉన్న అనుబంధం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరికొకరు అండగా నిలబడటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.