
సంయుక్త ప్రధాన పాత్రలో యోగి దర్శకత్వంలో ‘ది బ్లాక్ గోల్డ్’ అనే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. దీపావళికి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని, సంయుక్త పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
Key Points
వెంకటేష్ 'చింతకాయల రవి' ఫేమ్ డైరెక్టర్ యోగి దర్శకత్వంలో కొత్త లేడీ ఓరియెంటెడ్ మూవీ.
హస్యమూవీస్, మాగంటిపిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.6గా 'ది బ్లాక్ గోల్డ్' టైటిల్‌తో సినిమా.
సంయుక్త ప్రధాన పాత్రలో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
దీపావళి స్పెషల్‌గా 'ది బ్లాక్ గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది.
‘ది బ్లాక్ గోల్డ్’ మూవీ ప్రకటన
వెంకటేష్ నటించిన ‘చింతకాయల రవి’ ఫేమ్ డైరెక్టర్ యోగి.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీని తీయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. హస్యమూవీస్ అండ్ మాగంటిపిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్-6గా రాబోతున్న ఈ మూవీకి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తుండగా.. దీపావళి స్పెషల్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతున్నట్లు ప్రకటించారు.
ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంయుక్త క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఫస్ట్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ప్రజెంట్ సంయుక్త చేతిలో అఖండ 2, స్వయం భూ, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో పాటు.. పూరిసేతుపతి ప్రాజెక్టు కూడా ఉండగా.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
సంయుక్త పవర్ ఫుల్ పాత్ర, ఫస్ట్ లుక్
సంయుక్త కెరీర్, ఇతర ప్రాజెక్టులు
సంయుక్త నటిస్తున్న ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమా దీపావళి ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె కెరీర్‌లో ఈ మూవీ కీలక మలుపు అవుతుందని భావిస్తున్నారు.


