|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంయుక్త మీనన్ ‘బ్లాక్ గోల్డ్’ ఫస్ట్ లుక్: యాక్షన్ అవతార్‌లో అదరగొట్టిన బ్యూటీ!

Published: 01-01-2026, 5:00 AM
సంయుక్త మీనన్ 'బ్లాక్ గోల్డ్' ఫస్ట్ లుక్: యాక్షన్ అవతార్‌లో అదరగొట్టిన బ్యూటీ!
  • సంయుక్త మీనన్ ‘బ్లాక్ గోల్డ్’ చిత్రంతో యాక్షన్ అవతార్‌లో కనిపించనుంది.
  • సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు.
  • పోస్టర్‌లో గాయాలతో, చేతిలో రివాల్వర్‌తో సీరియస్‌గా సంయుక్త కనిపించింది.
  • ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం 2026 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.

సంయుక్త మీనన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. గాయాలతో, చేతిలో రివాల్వర్‌తో యాక్షన్ అవతార్‌లో సంయుక్త ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ హైలైట్స్

Samyukta Menon:సంయుక్త మీనన్ (Samyuktha Menon) విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమధ్యకాలంలో సెలెక్టివ్ గా పాత్రను ఎంచుకుంటూ.. తన సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న సంయుక్త.. తాజాగా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్స్ సందర్భంగా తాను నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఈమె బ్లాక్ గోల్డ్ అనే చిత్రంలో నటిస్తోంది.. ఈ మేరకు ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ పంచుకుంటూ.. “బ్లాక్ గోల్డ్ చిత్ర బృందం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బలం, స్థితి స్థాపకత, ధైర్యం, శక్తివంతమైన కథ.. ఈ వేసవి 2026 థియేటర్లలో వేచి ఉంది” అంటూ ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇక ఈ పోస్టర్లో సంయుక్త మొహం మీద గాయంతో చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్ గా చూస్తోంది.

యాక్షన్ అవతార్ లో సంయుక్త

పైగా ఈ పోస్టర్ మీద “బ్లడీ హ్యాపీ న్యూ ఇయర్” అని రెడ్ కలర్ తో రాసి ఉండడం హైలైట్ గా మారుతోంది. మొత్తానికైతే సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ గోల్డ్ మూవీ నుంచి మేకర్స్ పంచుకున్నారు. ఈ పోస్టర్ ను బట్టి చూస్తుంటే సంయుక్త ఇందులో హై యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమాలో సంయుక్త తన పెర్ఫార్మెన్స్ తో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందో తెలియాలి అంటే ఈ సమ్మర్ వరకు ఎదురు చూడాల్సిందే.

సంయుక్త మీనన్ సినీ ప్రస్థానం

మలయాళ చిత్రాల ద్వారా కెరియర్ ను ప్రారంభించిన సంయుక్త మీనన్.. తెలుగు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన నటనతో కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, సంతోషం ఫిలిం అవార్డులను కూడా దక్కించుకుంది. 2016లో వచ్చిన పాప్ కార్న్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కల్కి, ఎడక్కాడ్ బెటాలియన్ 06 వంటి చిత్రాలలో నటించిన ఈమె.. రానా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తర్వాత బింబిసారా, విరూపాక్షా చిత్రాలతో కమర్షియల్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. ప్రస్తుతం బ్లాక్ గోల్డ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

BIG TV తెలుగు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి Tags Samyukta Menon tollywood Share

మొత్తానికి, ‘బ్లాక్ గోల్డ్’ ఫస్ట్ లుక్ సంయుక్త మీనన్ నుండి అద్భుతమైన యాక్షన్ పర్ఫామెన్స్ ఉంటుందని సూచిస్తుంది. ఈ వేసవి 2026లో విడుదల కానున్న సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.