
📌 Key Points
- సందీప్ రాజ్ తీసిన ‘మోగ్లీ’ సినిమా అఖండ 2 కారణంగా వాయిదా పడింది.
- సినిమా వాయిదాపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు సందీప్ రాజ్.
- తన పోస్ట్‌ను సింపతి డ్రామా అనడాన్ని ఖండించారు.
- సానుభూతి కోరలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తన తదుపరి చిత్రం ‘మోగ్లీ’ వాయిదా పడటంపై చేసిన ఎమోషనల్ పోస్ట్ గురించి వివరణ ఇచ్చారు. సానుభూతి కోరుకోలేదని, తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ విమర్శలకు బదులిచ్చారు.
‘మోగ్లీ’ సినిమా వాయిదాపై ఎమోషనల్ పోస్ట్
Sandeep Raj: కలర్ ఫోటో సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj). ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే ఇలాంటి ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ రాజ్ తన తదుపరి చిత్రాన్ని సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల(Roshan Kanakala)తో చేశారు. మోగ్లీ (Mowgli)అంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది డిసెంబర్ 12వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా అఖండ 2 సినిమా కారణంగా వాయిదా పడింది. దీంతో దర్శకుడు ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు..
నేనే బ్యాడ్ లక్ ఏమో దర్శకుడిగా నా పేరును వెండితెరపై చూసుకోలేనేమో అంటూ ఈ సినిమా వాయిదా పడటం గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయటంతో ఈ పోస్ట్ పట్ల ఎంతోమంది ఈయనకు మద్దతుగా నిలబడి కామెంట్లు చేశారు.. ఈ క్రమంలోనే మరి కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఇదంతా కేవలం సింపతి డ్రామా అంటూ సందీప్ రాజ్ పోస్ట్ పై విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే తన పోస్టు పట్ల వచ్చిన ఈ విమర్శలపై సందీప్ రాజ్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
విమర్శలకు సందీప్ రాజ్ స్పందన
ఈ సందర్భంగా సందీప్ రాజ్ ఈ విషయంపై స్పందిస్తూ తన పట్ల ఎవరు సానుభూతి తెలియజేయాలని కోరుకోలేదు అంటూ తెలియచేశారు. నిన్న ఉదయం తనకు ఒక ఫోన్ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాని 2026 ఫిబ్రవరి లేదా ఏప్రిల్ కు వాయిదా వేద్దామంటూ ఫోన్ కాల్ రావడంతో కాస్త అప్సెట్ అయ్యానని తెలిపారు. ఈ సినిమాని మరి ఇంత ఆలస్యం కాకుండా ముందుగానే తీసుకురావాలని చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచించాము. ఈ సినిమా విడుదలకు మరే మార్గం లేదు. రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలోనే ఈ సినిమాని డిసెంబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నామని తెలిపారు.
తాను ఈ విషయంలో ఎవరిని విమర్శించలేదని అలాగే ఎవరి సానుభూతిని తాను కోరుకోలేదని తెలిపారు. అఖండ 2 సినిమా పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నా ఉద్దేశం అది కాదు అంటూ ఈ సందర్భంగా సందీప్ రాజ్ తన పోస్ట్ వెనుక ఉన్న ఆంతర్యం, తన ఆవేదనను బయట పెడుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి డిసెంబర్ 13 న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో 12వ తేదీనే ప్రీమియర్లను ప్రసారం చేయనున్నారు. బాలయ్య సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న మోగ్లీ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
సానుభూతి కోరలేదని సందీప్ రాజ్ స్పష్టం
మొత్తం మీద, సందీప్ రాజ్ తన ఆవేదనను తెలియజేయడానికి చేసిన పోస్ట్, సానుభూతి కోరడానికి కాదని స్పష్టం చేశారు. ‘మోగ్లీ’ డిసెంబర్ 13న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఈ వివరణ చర్చకు తెరదించింది.

