|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sankranthiki Vastunnam 2: సీక్వెల్ కు సిద్ధమైన సంక్రాంతికి వస్తున్నాం.. రంగంలోకి మరో హీరోయిన్?

Published: 07-12-2025, 5:08 AM
Sankranthiki Vastunnam 2: సీక్వెల్ కు సిద్ధమైన సంక్రాంతికి వస్తున్నాం.. రంగంలోకి మరో హీరోయిన్?
  • 2027 సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం 2” సీక్వెల్ విడుదల ప్లాన్.
  • శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణం.
  • తొలి భాగం “సంక్రాంతికి వస్తున్నాం” రూ.300 కోట్లకు పైగా వసూళ్లు.
  • మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌తో పాటు మరో హీరోయిన్ చేరికపై చర్చ.

2027 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం 2’ సినిమా సీక్వెల్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన తొలి భాగం అద్భుత విజయం సాధించగా, సీక్వెల్‌లో మరో హీరోయిన్ చేరికపై వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం 2: విడుదల, నిర్మాణం వివరాలు

Sankranthiki Vastunnam 2: సంక్రాంతి అంటేనే సినిమాలో పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల చేసే విధంగా మేకర్స్ ఇప్పటినుంచి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam) సినిమా సీక్వెల్ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు అయితే త్వరలోనే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.

తొలి భాగం భారీ విజయం: వసూళ్లు

ఇక ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులను త్వరలోనే ప్రారంభించి 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , ఐశ్వర్య రాజేష్ తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా పనులు పూర్తి అయిన వెంటనే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా రానుంది.

కొత్త హీరోయిన్ ఎంట్రీపై చర్చ: అనిల్ రావిపూడి తదుపరి చిత్రం

మొత్తం మీద, ‘సంక్రాంతికి వస్తున్నాం 2’ సీక్వెల్ 2027 సంక్రాంతికి విడుదలై మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. కొత్త హీరోయిన్ చేరికపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.