|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి యుద్ధం 2026: తొలి వికెట్ డౌన్! గెలుపెవరిదో?

Published: 10-01-2026, 5:30 AM
సంక్రాంతి యుద్ధం 2026: తొలి వికెట్ డౌన్! గెలుపెవరిదో?
  • 2026 సంక్రాంతి రేసులో ‘రాజా సాబ్’ నెగిటివ్ టాక్‌తో వెనుకడుగు.
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ ట్రైలర్ సీరియల్‌లా ఉందని కామెంట్స్.
  • రవితేజ కామెడీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం.
  • నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా జనవరి 14న విడుదల.

2026 సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. రాజా సాబ్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో మిగతా సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిశెట్టి తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

రాజా సాబ్ రివ్యూ: తొలి అడుగు తప్పటడుగు?

Sankranti 2026 Movies : 2026 సంక్రాంతి వార్ స్టార్ట్ అయింది. ఎప్పటిలానే… మొదటగా రిలీజ్ అయిన ది రాజా సాబ్ సినిమా నెగిటివ్ టాక్‌ను ఎదుర్కొంటుంది. ఓపెనింగ్స్ పర్వలేదు అని అనిపించినా… ఎక్స్‌పెక్ట్ చేసినంత మాత్రం రాలేదు. కానీ, డే 2 నుంచి అయితే.. బుకింగ్స్ అత్యంత దారుణంగా పడిపోయాయి. డే 1 వచ్చిన నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ ఉందని అర్థమవుతుంది.

మూడు గంటల పైనే సినిమా ఉండటం, నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడకపోవడం, సినిమా కథ వరకు బానే ఉన్నా… వీక్ స్క్రీన్ ప్లే వల్ల సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది. మొత్తంగా చూస్తే సంక్రాంతి వార్‌లో ఫస్ట్ బాలే మెయిన్ వికెట్ పడిపోయిందని అంటున్నారు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్స్ (హీరోలు) పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది.

చిరంజీవి సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి?

ఈ సంక్రాంతికి రాజా సాబ్ తర్వాత రాబోయే సినిమా.. మన శంకర వరప్రసాద్. ఇది జనవరి 12న రిలీజ్ కాబోతుంది. చిరంజీవి హీరో. నయనతార హీరోయిన్. గెస్ట్ రోల్‌లో వెంకటేష్. ముఖ్యంగా సంక్రాంతి అంటే గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి దే ఈ సినిమా. చూడటానికి, చెప్పుకోవడానికి గ్రాండ్ లెవలె‌లోనే ఉంది. కానీ, ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా సీరియల్‌లా ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. అలాగే, ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు చిరంజీవి దగ్గర చేయడానికే అనిల్ రావిపూడి చేస్తున్నాడని, ఆయన మార్క్ పెద్దగా ఉండక పోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా జరిగితే.. ఈ వికెట్ పడటానికి కూడా పెద్దగా టైం తీసుకోకపోవచ్చు.

మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సంక్రాంతికి కామెడీ జానర్‌నే నమ్ముకున్నాడు. పెళ్లై పెళ్లాం ఉన్నా… మరో అమ్మాయితో హీరో ప్రేమలో పడితే.. అనే కాన్సెప్ట్‌తో ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తిని చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న రిలీజ్ అవుతుంది. తిరుమల కిషోర్‌పై తెలుగు ఆడియన్స్‌కు మంచి నమ్మకం ఉంటుంది. ఇన్ సైడ్ వర్గాల నుంచి కొంత వరకు పాజిటివ్ టాక్ వచ్చినా… థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఏ మాత్రం సంతృప్తి పరుస్తుందో చూడాలి.

సంక్రాంతి బరిలో రవితేజ, నవీన్ పొలిశెట్టి

ఈ సంక్రాంతి బరిలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఉన్నాడు. అనగనగా ఒక రాజు అనే సినిమాతో ఈ జనవరి 14న థియేటర్స్ లోకి వస్తున్నాడు. బాగా డబ్బున్న రాజు.. తనకు సమానంగా డబ్బు ఉంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఆ నేపథ్యంలో కామెడీ జానర్‌లో సినిమా చేశారు. అయితే, నవీన్ పొలిశెట్టి అంటే… మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జాతి రత్నాలు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి ఇలాంటి సాఫ్ట్ కామెడీ మూవీ చేయడం అంటే… కాస్త సాహసంతో కూడినదే. అందులోనూ.. సంక్రాంతి బరిలో దింపాడు. ప్రొడ్యూసర్ నాగ వంశీ అయితే బానే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. సినిమాలో పొలిశెట్టి మార్క్ ఉంటే పర్లేదు. లేకపోతే మాత్రం ఈ బ్యాట్స్‌మెన్ కూడా డకౌట్ అవ్వడం ఖాయం.

ఈ సంక్రాంతి బరిలో అన్నింటి కంటే చివరగా వస్తున్న తెలుగు సినిమా ఈ నారి నారి నడమ మురారి. జనవరి 14న సాయంత్రం 5:49 నుంచి షోలు స్టార్ట్ కాబోతున్నాయి. అన్నింటి కంటే చివరగా వచ్చే సినిమా మాత్రమే కాదు… ఈ సంక్రాంతి సినిమాల్లో అన్నింటి కంటే సైలెంట్ గా ఉన్న మూవీ కూడా ఇదే. ఎంత ప్రమోషన్స్ చేసినా ప్రభావం లేదు అని మిగితా సినిమాలు అంటుంటే… శర్వానంద్ మాత్రం బయటికే రావడం లేదు. ప్రమోషన్సే చేయడం లేదు. ఇలాగే ఉంటే… శర్వా వికెట్ కూడా క్లీన్ బోల్డ్ అవ్వొచ్చు.

మొత్తానికి 2026 సంక్రాంతికి పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాలు విజయం సాధిస్తాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.