
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన పుట్టినరోజున అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. వేలాది మంది అభిమానులు వేడుకకు తరలిరాగా, జనసమూహ నియంత్రణతో సమావేశం రద్దయింది. అభిమానులను పలకరించలేకపోయినందుకు షారుక్ ఖాన్ హృదయపూర్వక క్షమాపణలు చెప్పాడు.
Key Points
షారుక్ ఖాన్ పుట్టినరోజున వేలాది మంది అభిమానులు ఆయన కోసం తరలివచ్చారు.
జనసమూహ నియంత్రణ కారణంగా షెడ్యూల్ చేసిన అభిమానుల సమావేశం రద్దు అయింది.
అభిమానులను పలకరించలేకపోయినందుకు షారుక్ ఖాన్ ఎక్స్ (X) వేదికగా క్షమాపణలు తెలిపారు.
మీరు చూపిస్తున్న ఆప్యాయత, నమ్మకం తనకు అత్యంత విలువైనవని ఖాన్ పేర్కొన్నారు.
అభిమానులకు షారుక్ ఖాన్ షాక్
బాలీవుడ్ స్టారో హీరో అయిన షారుక్ ఖాన్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది అభిమానులో తరలి వచ్చారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన తన అభిమానులతో సమావేశం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో జనసమూహ నియంత్రణ కారణంగా సమావేశం రద్దు అయింది. దీంతో తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను పలకరించ లేకపోయినందుకు షారుక్ ఖాన్ హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశాడు.
అందులో.. “మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు. కానీ ఇది మీ అందరి భద్రత కోసం తీసుకున్న నిర్ణయం అని నాకు తెలియజేశారు. అని ఖాన్ రాసుకొచ్చాడు. ఇదే ట్వీట్‌లో “అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేసిన ఆయన, “మీరు చూపిస్తున్న ఆప్యాయత, నమ్మకం నాకు అత్యంత విలువైనవి. నేను మిమ్మల్ని చూడలేకపోయినా, మీ కంటే ఎక్కువగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. త్వరలో మీ అందరినీ కలుపుకొని నా ప్రేమను వ్యక్తం చేయాలని ఎదురుచూస్తున్నాను,” అని పేర్కొన్నారు. ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను కదిలిస్తోంది.
సమావేశం రద్దు, క్షమాపణలు
ఎక్స్ (X) వేదికగా ప్రేమ సందేశం
అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల షారుక్ ఖాన్ క్షమాపణలు చెప్పి, త్వరలో కలుస్తానని హామీ ఇచ్చాడు. ఈ సంఘటన అభిమానులకు నిరాశ కలిగించినా, ఆయన ప్రేమ సందేశం వారిని కదిలించింది.


