
హురున్ ఇండియా నివేదిక ప్రకారం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అత్యంత సంపన్నుడైన భారతీయ సెలబ్రిటీగా నిలిచారు. 1.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆయన హాలీవుడ్ ప్రముఖులను సైతం అధిగమించారు. సినిమాలతో పాటు పలు వ్యాపారాలు ఆయన సంపదకు మూలం.
Key Points
హురున్ ఇండియా నివేదిక ప్రకారం షారుఖ్ ఖాన్ అత్యంత ధనవంతుడైన బాలీవుడ్ సెలబ్రిటీ.
ఆయన ఆస్తుల విలువ 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు 12,490 కోట్లు).
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, ఐపీఎల్ టీమ్ వంటి వ్యాపారాల ద్వారా భారీ ఆదాయం.
టాలర్ స్విఫ్ట్, టామ్ క్రూజ్ వంటి హాలీవుడ్ స్టార్స్ కంటే SRK సంపాదన ఎక్కువ.
షారుఖ్ ఆస్తుల విలువ: షాకింగ్ వివరాలు
Shah Rukh Khan : కేవలం వ్యాపారవేత్తలు కాదు సినిమా సెలబ్రిటీలు కూడా బాగానే సంపాదిస్తారు, ఆస్తులు కూడబెడతారు. తాజాగా ది హురున్ ఇండియా అనే సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో రిచెస్ట్ పర్సన్స్ ని, సంస్థలను ప్రకటించింది. ఇందులో బాలీవుడ్ లో కూడా రిచ్ పర్సన్స్ ని ప్రకటించింది.(Shah Rukh Khan)
బాలీవుడ్ లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచాడు. 1.4 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు 12 వేల 490 కోట్ల విలువ చేసే ఆస్తులతో షారుఖ్ ఈ లిస్ట్ లో టాప్ లో నిలిచాడు. షారుఖ్ కేవలం సినిమాలో నటిస్తూ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా యాడ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ, కోల్ కత్తా నైట్ రైడర్స్ లో భాగం, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక టీమ్ లో వాటా, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాటాదారుడిగా సంపాదిస్తున్నాడు. ఈ బిజినెస్ లతో షారుఖ్ ఆస్తుల విలువ ఈ రేంజ్ కి పెరిగింది.
హాలీవుడ్ ప్రముఖులను మించిన SRK సంపాదన
గత కొన్నాళ్లుగా షారుఖ్ టాప్ రిచెస్ట్ బాలీవుడ్ లిస్ట్ లో ఉంటున్నాడు కానీ తాజాగా నెంబర్ 1 పొజిషన్ కి చేరుకున్నాడు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి జుహీ చావ్లా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే షారుఖ్ నెట్ వర్త్ ఏకంగా కొంతమంది హాలీవుడ్ సెలబ్రిటీలను మించిపోయింది.
షారుఖ్ ఖాన్ ఆదాయ వనరులు
హాలీవుడ్ సింగర్ టేలర్ స్విఫ్ట్(1.3 బిలియన్ డాలర్స్), నటుడు ఆర్నాల్డ్(1.2 బిలియన్ డాలర్స్), నటి సెలెనా గోమెజ్, టామ్ క్రూజ్(600 మిలియన్ డాలర్స్).. ఇలా చాలా మంది హాలీవుడ్ స్టార్స్ కంటే షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఎక్కువ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ లిస్ట్ తో బాలీవుడ్ లోనే కాదు వరల్డ్ లోనే రిచెస్ట్ నటుడిగా షారుఖ్ నిలిచాడు.
Also See : Manchu Manoj : భార్యతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..
షారుఖ్ ఖాన్ సంపాదన కేవలం బాలీవుడ్ లోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఆయనను అత్యంత ధనవంతుడైన నటుడిగా నిలిపింది. ఈ నివేదిక ఆయన వ్యాపార దక్షతకు, బ్రాండ్ విలువకు నిదర్శనం.


