|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వానంద్ కామెడీ పంచ్: మాజీ ప్రియురాలు మేనేజర్‌గా వస్తే, సంక్రాంతికి నవ్వుల పండగేనా?

Published: 22-12-2025, 8:44 AM
శర్వానంద్ కామెడీ పంచ్: మాజీ ప్రియురాలు మేనేజర్‌గా వస్తే, సంక్రాంతికి నవ్వుల పండగేనా?
  • శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం.
  • ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్ పడే పాట్లే సినిమా ప్రధాన కథాంశం.
  • అమ్మాయిల స్కూటీ నడిపే విధానంపై సునీల్ చెప్పిన డైలాగ్, కామెడీ టీజర్ కు హైలైట్.
  • లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ విడుదలైంది. ఎక్స్-ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వా పడే పాట్లను హాస్యభరితంగా చూపించారు. సంక్రాంతికి నవ్వులు పంచే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

నవ్వులు పంచిన ‘నారి నారి నడుమ మురారి’ టీజర్

Nari Nari Naduma Murari Teaser: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న లవ్ ‌ అండ్ ‌ ఫ్యామిలీ ఎంటర్ ‌ టైనర్ ‌ ‘ నారి నారి నడుమ మురారి ’ ( Nari Nari Naduma Murari). రామ్ ‌ అబ్బరాజు దర్శకత్వలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు . రొమాంటిక్ ‌ లవ్ ‌ అండ్ ‌ కామెడీ డ్రామా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది . ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ‌ వేగవంతం చేసిన మూవీ టీం తాజాగా టీజర్ ‌ రిలీజ్ చేసింది . టీజర్ ‌ మొత్తం కామెడీ ఎంటర్ ‌ టైనర్ ‌ గా సాగింది . ఈ టీజర్ ‌ లో కామెడీ హైలెట్ ‌ అయ్యింది .

అమ్మాయిల స్కూటీ నడిపే విధానం , ఇద్దరు ప్రియురాళ్లు ఒకే ఆఫీసులో ఉంటే ప్రియుడి పడే పాట్లు . ఎక్స్ ‌ గర్ల్ ‌ ఫ్రెండ మేనేజర్ ‌ గా వస్తే ఎలా ఉంటుందనే అంశాలను డైరెక్టర్ల ‌ సరదాగా , కామెడీగా ప్రేక్షకులకు అందించబోతున్నాడని టీజర్ ‌ చూస్తుంటే అర్థమైపోతుంది . ప్రతి డైలాగ్ ‌, ప్రతీ సీన్ ‌ ప్రేక్షకులు ఎంజాయ్ ‌ చేసేలా ఉంది . ముఖ్యంగా అమ్మాయిలు స్కూటీ నడుపే మీమ్ టీజర్లో వాడారు. హీరో సునీల్ మధ్య సన్నివేశంలో అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే.. బ్రేక్ ‌ లు పట్టాల్సిన టైంలో రెండు కాళ్లు పెట్టి ఆపింది సర్.. అంటే ఎందుకలా చేసిందనగానే.. తనకి తన కాళ్ల మీదే నిలబడ్డం ఇష్టం సర్ అనే డైలాగ్ విపరీతంగా నవ్విస్తుంది.

కథాంశం ఆసక్తికరంగా.. శర్వానంద్ కామెడీ టైమింగ్

ఈ సీన్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అలా అవుట్ ‌ అండ్ ‌ అవుట్ ‌ కామెడీతో ‘ నారి నారి నడుమ మురారి’ టీజర్ ‌ ఆకట్టుకుంటుంది .  ప్రస్తుతం ఈ టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.  ఆఫీసులో ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు . అదే టైంలో తన ఎక్స్ ‌ గర్ల్ ‌ ఫ్రెండ్ ‌ ఆఫీసులో వారికి మేనేజర్ ‌ గా వస్తుంది . ఆ తర్వాత హీరో జీవితంలో ఏం జరిగిందనేదే ఈ నారి నారి నడుమ మురారి మూవీ కథ అని అర్థమైపోతుంది . ఇక హీరో ఆటోలో వెళ్తున్న సీన్ ‌ తో టీజర్ ‌ మొదలైంది . అర్థరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు సర్ ‌ అని అడిగితే .. పెళ్లి కూతురిని తీసుకురావడానికి అని చెప్పూ సమాధానం ఆసక్తి కలిగిస్తోంది . ఇందులో శర్వా తనదైన కామెడీ టైమింగ్ ‌ తో ఆకట్టుకున్నాడు .

సంక్రాంతికి విడుదలవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో శర్వా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించనున్నాడనిపిస్తోంది . ఈ సినిమాలో నటుడు నరేష్ ‌ శర్వా తండ్రిగా కనిపించబోతున్నాడు . సునీల్ ‌, వెన్నెల కిషోర్ ‌, సత్య ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా .. మరో యంగ్ హీరో శ్రీ విష్ణు ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నాడు . ఏకే ఎంటర్ ‌ టైన్ ‌ మెంట్స్ ‌ బ్యానర్ ‌ పై అనిల్ ‌ సుంకర్ ‌, రామ బ్రహ్మం సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఇక సంక్రాంతికి కానుగా జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .

‘నారి నారి నడుమ మురారి’ టీజర్ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచింది. శర్వానంద్ కామెడీ టైమింగ్, విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం సంక్రాంతికి పక్కా హిట్టయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.