
బిగ్ బాస్ 13లో ప్రేక్షకులను మెప్పించిన షెహనాజ్ గిల్ తాజాగా ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Key Points
షెహనాజ్ గిల్ కొత్త మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు.
కారు ధర దాదాపు 1.35 కోట్లు.
బిగ్ బాస్ 13 తో పాపులర్ అయిన షెహనాజ్ సినిమా, పాటల్లో నటిస్తోంది.
అభిమానులు షెహనాజ్ కృషికి అభినందనలు తెలుపుతున్నారు.
షెహనాజ్ గిల్ కొత్త వాహనం
నటి, సింగర్ షెహనాజ్ గిల్ ( Shehnaaz Kaur Gill ) హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌తో ఎక్కువ పాపులరైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన షెహనాజ్ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కలలు కనడం దగ్గరి నుంచి కారు నడిపేవరకు.. నా కష్టానికి ప్రతిఫలంగా ఈ నాలుగు చక్రాల కారు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది అని ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
కారు ధర వివరాలు
ధర ఎంతంటే? షెహనాజ్.. మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రూ.1.35 కోట్లుగా ఉంది. మ్యూజిక్ వీడియోలో, సాంగ్స్‌లో ఎక్కువగా కనిపించే షెహనాజ్ పంజాబ్‌లో పలు సినిమాలు చేసింది. 2019లో హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో పాల్గొంది. ఈ సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2023లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో యాక్ట్ చేసింది. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలోనూ నటించింది. విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో సజ్నా వె సజ్నా అనే స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం హిందీలో సబ్ ఫస్ట్ క్లాస్, పంజాబీలో ఇక్క్ కుడి చిత్రాలు చేస్తోంది.
షెహనాజ్ సినిమా జీవితం
షెహనాజ్ గిల్ కష్టపడి సాధించిన విజయానికి ఇది నిదర్శనం. ఆమె భవిష్యత్ కెరీర్‌కు శుభాకాంక్షలు.


