|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎలా పడితే అలా రాడానికి, పోడానికి ఇదేమైనా బస్సా- బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వార్నింగ్- భయపడిన సింగర్ రాము రాథోడ్

Published: 10-11-2025, 9:54 AM
ఎలా పడితే అలా రాడానికి, పోడానికి ఇదేమైనా బస్సా- బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వార్నింగ్- భయపడిన సింగర్ రాము రాథోడ్

బిగ్ బాస్ తెలుగు 9 నుండి సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సింగర్ రాము రాథోడ్‌ను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హీరో శివాజీ గట్టిగా ప్రశ్నించారు. ఈ ఇంటర్వ్యూలో శివాజీ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్‌లు, రాము సమాధానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు.

Key Points

1

సింగర్ రాము రాథోడ్ బిగ్ బాస్ తెలుగు 9 నుండి ఈ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

2

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హీరో శివాజీ తన ప్రశ్నలతో రాము రాథోడ్‌ను భయపెట్టారు.

4

సంచాలక్‌గా రాము గందరగోళంపై శివాజీ ప్రశ్నించగా, రాము మానిప్యులేట్ అయ్యారని చెప్పారు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నల వర్షం

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన వాళ్లను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ద్వారా హీరో శివాజీ ప్రశ్నలు అడుగుతాడని తెలిసిన విషయమే. ఈ క్రమంలో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము రాథోడ్‌ను తన ప్రశ్నలతో భయపెట్టేశాడు మాజీ కంటెస్టెంట్ శివాజీ.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. తొమ్మిదో వారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సాయి శ్రీనివాస్‌తోపాటు ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ పేరుతో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేస్తాడు.

బిగ్ బాస్ హౌస్ గురించి శివాజీ కీలక వార్నింగ్

“ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఐదేళ్లు డే అండ్ నైట్ కష్టపడితే సక్సెస్ వచ్చింది. మరి కప్పు కొట్టడానికి కేవలం 15 వారాల. ఎవరైనా బిగ్ బాస్ హౌజ్‌ జస్చ్ చూద్దామని వచ్చేవారికి చెబుతున్నా ప్లీజ్ దయచేసి రాకండి. మీ ప్లేసులో ఇంకొకరు వస్తారు. కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ఇది బిగ్ బాస్” అని వార్నింగ్ ఇచ్చాడు హీరో శివాజీ.

“కచ్చితంగా క్లారిటీగా ఉంటాను” అని రాము రాథోడ్ చెప్పాడు. “మరి హౌజ్‌లో సంచాలక్‌గా ఉన్నప్పుడు ఎందుకు అన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయ్యావ్” అని ప్రశ్నించాడు శివాజీ. “ఒక్కొక్కళ్లు ఏదోటి మాట్లాడి మాన్యుపులేట్ చేశారు” అని రాము సమాధానం ఇచ్చాడు.

సంచాలక్‌గా రాము గందరగోళంపై శివాజీ నిలదీత

“లక్కీతో లాక్కొస్తుందా అక్కయ్య” అని శివాజీ నవ్వుతూ అన్నాడు. “స్కోప్ లేకపోయినా అక్కడ దూరిపోవాలి” అని రాము అంటే.. “నువ్వు దూరుతావ్ కానీ ఏం మాట్లాడవ్. ఆవిడ దూరి ఏదోటి చేస్తది” అని శివాజీ అన్నాడు. తర్వాత “గౌరవ్ సంజనను కిందకు లాగాడా, గౌరవ్ దిగాక సంజన దిగిందా” అని మరో ప్రశ్న అడిగాడు హీరో శివాజీ .

శివాజీ తన అనుభవాన్ని పంచుకుంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి టైంపాస్ కోసం రావద్దని ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తోంది. రాము రాథోడ్ పై శివాజీ చూపిన ప్రభావం ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.