|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శోభిత సంచలన ప్రకటన: చైతూతో బంధంపై తుది నిర్ణయం నాదే! అసలేం జరిగిందంటే?

Published: 23-01-2026, 5:35 AM
శోభిత సంచలన ప్రకటన: చైతూతో బంధంపై తుది నిర్ణయం నాదే! అసలేం జరిగిందంటే?
  • శోభిత ధూళిపాళ, నాగచైతన్యల వివాహం డిసెంబర్ 4న జరిగింది.
  • శోభిత నటించిన ‘చీకటిలో’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • సంక్రాంతి వేడుకలను అక్కినేని కుటుంబంతో కలిసి జరుపుకున్న శోభిత.
  • సినిమాల విషయంలో తన నిర్ణయాలు తనవేనని తెలిపిన శోభిత ధూళిపాళ.

ప్రముఖ నటి శోభిత ధూళిపాళ నాగచైతన్యతో తన వివాహం గురించి, కొత్త సినిమా ‘చీకటిలో’ గురించి మాట్లాడింది. అంతేకాకుండా, అక్కినేని కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుకున్నారో వివరించింది.

నాగచైతన్యతో శోభిత వివాహం

Sobhita dhulipala:ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita dhulipala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అక్కడే సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో గూఢచారి, మేజర్ అంటూ కొన్ని సినిమాలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఎప్పుడైతే నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయో.. ఇక అప్పటినుంచి ఈమె గురించి నాగచైతన్య అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే వీరిద్దరూ రహస్యంగా తమ బంధాన్ని మెయింటైన్ చేశారు.. కానీ సడన్ గా 2024 జూన్ లో నిశ్చితార్థం చేసుకోవడం, ఆ నిశ్చితార్థ ఫోటోలను స్వయంగా నాగార్జున బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అప్పటినుంచి ఈ జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత శోభిత ‘ చీకటిలో’ అనే తెలుగు సినిమా చేసింది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది శోభిత. అందులో భాగంగానే నాగచైతన్య గురించి, సంక్రాంతి పండుగ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘చీకటిలో’ సినిమాతో శోభిత రీఎంట్రీ

శోభిత ధూళిపాళ మాట్లాడుతూ..” నాకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఇంట్లో పాతబడిన వస్తువులు, కర్రలు అన్నింటినీ సేకరించి ఉదయాన్నే మంటలో వేయడం అంటే మరింత సంతోషం. నేను ముంబై వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మా వైజాగ్ లో భోగి పండుగను చాలా గ్రాండ్గా చేసుకునే దాన్ని. అయితే ఈసారి మాత్రం ఇక్కడ అక్కినేని ఇంట్లో చేశాము. మా పేరెంట్స్ కూడా ఇక్కడికే వచ్చారు. మొదటి సంక్రాంతికి మేము వైజాగ్ వెళ్ళాము” అంటూ శోభిత ధూళిపాళ సంక్రాంతి పండుగ గురించి చెప్పుకొచ్చింది.

సంక్రాంతి వేడుకల్లో శోభిత ధూళిపాళ

నాగచైతన్య గురించి మాట్లాడుతూ..” నేను నాగచైతన్య వేరే సినిమాలు గురించి మాట్లాడుకుంటాము. ఆడియన్స్ గురించి కూడా మాట్లాడుకుంటాము. ముఖ్యంగా మా సినిమాల గురించి మేము ఎక్కువగా మాట్లాడము.. అప్పుడప్పుడు చైతన్య దగ్గర నా సినిమాల కోసం ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అంతేకానీ నిర్ణయాలు మాత్రం ఆయన దగ్గర్నుంచి తీసుకోను . నాకు నచ్చింది నేనే చేసుకుంటూ వస్తున్నాను. అందుకే ఏ విషయంలోనైనా సరే సజెషన్స్ అడుగుతాను కానీ తుది నిర్ణయం నాదే అంటూ తెలిపింది శోభిత ధూళిపాళ. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాగచైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నారు. నాగచైతన్య 24వ సినిమా గా వస్తున్న ఈ చిత్రానికి విరూపాక్షా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. త్వరలో వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు నాగచైతన్య.

మొత్తానికి శోభిత తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయని ఆమె స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.